Lok Sabha polls 2024: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు వస్తాయి: బిహార్ సీఎం నితీశ్ కుమార్

దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను దీనిపై దృష్టి పెట్టానని నితీశ్ కుమార్ చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా నిలుస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడం, కేంద్రంలో బీజేపీని గద్దెదించడంపైనే తన లక్ష్యాన్ని పెట్టానని చెప్పారు. రేపు ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీ నేతలను నితీశ్ కుమార్ కలవనున్నారు.

Lok Sabha polls 2024: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు వస్తాయి: బిహార్ సీఎం నితీశ్ కుమార్

Lok Sabha polls 2024

Lok Sabha polls 2024: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను భారత ప్రధానమంత్రిగా చూడాలని ఉందని జేడీయూ నేతలు అన్నారు. బిహార్ రాజధాని పట్నాలో జేడీయూ నేతల సమావేశం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో దేశ రాజకీయాలు, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ తో జేడీయూ నేతలు పలు అంశాలపై చర్చించి, దేశ తదుపరి ప్రధాని అభ్యర్థి రేసులు నిలవాలని అన్నారు. దీంతో నితీశ్ కుమార్ స్పందిస్తూ… దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం తాను దీనిపై దృష్టి పెట్టానని నితీశ్ కుమార్ చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా నిలుస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడం, కేంద్రంలో బీజేపీని గద్దెదించడంపైనే తన లక్ష్యాన్ని పెట్టానని చెప్పారు. రేపు ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీ నేతలను నితీశ్ కుమార్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీ దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలను చాలా మందిని మభ్యపట్టి కాషాయం పార్టీలో చేర్చుకుంటోందని, దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

తాము ఎన్డీఏలో ఉన్న సమయంలో జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీలో కలుపుకునే ప్రయత్నాలు జరగలేదని, ఇప్పుడు మాత్రం ఆ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కాగా, పట్నాలో నితీశ్ కుమార్ సంబంధించిన పోస్టర్లను జేడీయూ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. ‘‘బిహార్ లో నితీశ్ కుమార్ నిరూపించుకున్నారు.. ఇక ఆయనను దేశం చూస్తుంది’’ అని అందులో పేర్కొన్నారు. ‘‘మార్పు ప్రారంభం కానుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం జరుగుతోన్న జేడీయూ సమావేశాల్లో జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. ఇందులో పార్టీ రూట్ మ్యాప్ ను ఖరారు చేస్తారు.

Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన