McLaren: ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటిష్ సూపర్ కార్ల సంస్థ ‘మెక్‌లారెన్’.. ధరలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

బ్రిటీష్ లగ్జరీ సూపర్ కార్ల సంస్థ ‘మెక్ లారెన్’ ఇండియాలో అడుగుపెట్టింది. దేశంలో మొదటి షో రూమ్‌ను ముంబైలో గురువారం ప్రారంభించింది. పలు సూపర్ కార్ మోడళ్లను లాంఛ్ చేసింది.

McLaren: ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటిష్ సూపర్ కార్ల సంస్థ ‘మెక్‌లారెన్’.. ధరలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

McLaren: బ్రిటన్‌కు చెందిన లగ్జరీ సూపర్ కార్ల తయారీ సంస్థ ‘మెక్ లారెన్ ఆటోమోటివ్’ ఇండియాలో అడుగుపెట్టింది. ఎప్పటినుంచో ఇండియన్ మార్కెట్లోకి రావాలని చూస్తున్న ఈ సంస్థ ఎట్టకేలకు గురువారం తమ మొదటి షోరూమ్‌ను ముంబైలో ప్రారంభించింది.

Elon Musk: బైబై మస్క్ అంటున్న ఉద్యోగులు.. రిప్ ట్విట్టర్ అంటున్న యూజర్లు.. ఆందోళన లేదంటున్న మస్క్

జీటీ, 720 ఎస్ స్పైడర్, 720 ఎస్ కపుల్ కార్లతోపాటు, 765 ఎల్‌టీ స్పైడర్ సూపర్ కార్లను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇవి లగ్జరీ సూపర్ కార్లు. ‘మెక్‌లారెన్’ సంస్థ తయారు చేసిన కార్లలో వీటికి మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే పలువురు భారతీయుల దగ్గర ఇలాంటి కార్లున్నప్పటికీ, అవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అయితే, ఇకపై వీటిని ఇండియాలోనే కొనుక్కోవచ్చు. ఈ సంస్థ రూపొందించిన కార్లలో 765 ఎల్‌టీ హైపర్ కార్‌ అత్యధిక వేగంతో ప్రయాణించగలదు. ఈ లగ్జరీ కార్లు 2.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలవు.

వీటి ధరలు మాత్రం భారీగానే ఉన్నాయి. 720 ఎస్ కారు ధర సుమారు రూ.4.6 కోట్లు, 765 ఎల్‌టీ స్పైడర్ ధర రూ.5 కోట్లు, జీటీ కార్ ధర రూ.4 కోట్లుగా ఉంది. కార్ డిజైన్‌కు సంబంధించి కస్టమైజ్డ్, పర్సనలైజ్డ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో సూపర్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో లాంబోర్గిని, ఫెరారి వంటి సంస్థలు దేశంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి.