M K Stalin : కావేరి బేసిన్‌లో చమురు,గ్యాస్ నిక్షేపాలు వెలికితీత బిడ్లు రద్దు చేయండి : స్టాలిన్

తమిళనాడు లోని కావేరి బేసిన్‌లోని వడతేరు బ్లాక్ లో చమురు గ్యాస్ నిక్షేపాలు వెలికితీత బిడ్లు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు.

M K Stalin : కావేరి బేసిన్‌లో చమురు,గ్యాస్ నిక్షేపాలు వెలికితీత బిడ్లు రద్దు చేయండి : స్టాలిన్

Cancel Bids For Hydrocarbon Extraction In Cauvery Basin Stalin Urges Pm Modi

M K Stalin : తమిళనాడు లోని కావేరి బేసిన్‌లోని వడతేరు బ్లాక్ లో చమురు గ్యాస్ నిక్షేపాలు వెలికితీత బిడ్లు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన మోడీకి ఒకలేఖ రాశారు.

పెట్రోలియం, సహాజవాయువుల మంత్రిత్వ శాఖ  జూన్ లో కావేరి బేసిన్‌లోని  పుదుక్కోటై జిల్లాలోని  వడతేరు వద్ద చమురు, గ్యాస్ నిక్షేపాలు వెలికితీత కోసం బిడ్లను ఆహ్వానించిందని.. ఈ ప్రాజెక్టు కావేరి బేసిన్ లోని రైతులకు ముప్పుగా మారనుందని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లే ఈ ప్రాజెక్ట్ ను ఆపేలా సంబంధిత మంత్రిత్వశాఖను ఆదేశించాలని స్టాలిన్ ప్రధానని కోరారు.

ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని..అలాగే భవిష్యత్తులో ఈ తరహా ప్రాజెక్టులపై ముందుకెళ్లే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించేలా పెట్రోలియం శాఖను ఆదేశించాలని స్టాలిన్ ఆ లేఖలో ప్రధానిని కోరారు.

శతాబ్దాల కాలంగా కావేరి బేసిన్ అన్నపూర్ణ లాంటిదని ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని ఆయన పేర్కోన్నారు. లక్షలాదిమంది రైతులు వ్యవసాయంపై ఆధార పడి జవిస్తున్నారని ఆయన లేఖలో వివరించారు. కావేరి బేసిన్ లో సహజవాయు నిక్షేపాలు వెలికితీయటానికి ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రజల మనోభావాలు, తమిళనాడుప్రభుత్వం చట్టబధ్దమైన చట్టాలను అధికారులు పట్టించుకోకపోవటం దురదృష్టకరం అని ఆయన అన్నారు.