CBI Raids: బిహార్‌లో సీబీఐ దాడులు.. పలువురు ఆర్జేడీ నేతల నివాసాల్లో సోదాలు

రైల్వే ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్న కేసు విచారణలో భాగంగా బిహార్‌లో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాడులు చేస్తోంది. భూములను లంచంగా తీసుకున్న ఆరోపణలపై సీబీఐ బిహార్ లోని ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై కేసు నమోదు చేసిన విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. 2004-09 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం 2009లో జరిగిన రిక్రూట్‌మెంట్లలో పలువురు అభ్యర్థులకు గ్రూప్‌ డీ ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ భూములను లంచంగా తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి. ఆర్జేడీ ఎంపీ అహ్మద్ కరీం, ఎమ్మెల్సీ సునీల్ సింగ్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్ళలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

CBI Raids: బిహార్‌లో సీబీఐ దాడులు.. పలువురు ఆర్జేడీ నేతల నివాసాల్లో సోదాలు

CBI Raids

CBI Raids: రైల్వే ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్న కేసు విచారణలో భాగంగా బిహార్‌లో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాడులు చేస్తోంది. భూములను లంచంగా తీసుకున్న ఆరోపణలపై సీబీఐ బిహార్ లోని ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై కేసు నమోదు చేసిన విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. 2004-09 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం 2009లో జరిగిన రిక్రూట్‌మెంట్లలో పలువురు అభ్యర్థులకు గ్రూప్‌ డీ ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ భూములను లంచంగా తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి.

ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, కూతురు మిసా భారతీతో పాటు ఉద్యోగాలు పొందిన పలువురిని సీబీఐ నిందితులుగా చేర్చింది. ఈ కేసులోనే ఇవాళ పట్నాలో సీబీఐ సోదాలు జరుపుతోంది. ఆర్జేడీకి చెందిన ఇద్దరు నేతల ఇళ్ళపై సోదాలు జరుపుతోంది. ఆర్జేడీ ఎంపీ అహ్మద్ కరీం, ఎమ్మెల్సీ సునీల్ సింగ్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్ళలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దీనిపై ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సోదాలు జరిపిస్తోందని, ఈ దాడులు చేయడంలో అర్థం లేదని ఆర్జేడీ ఎమ్మెల్సీ సింగ్ అన్నారు. ఇలా సోదాలు చేసి భయపెడితే బీజేపీలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు చేరతారని కాషాయపార్టీ భావిస్తోందని అన్నారు. కాగా, గతంలోనూ ఢిల్లీతో పాటు పట్నా, గోపాల్‌ గంజ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారు.

Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..