భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో హోళీ వేడుకలు..!

సాధారణంగా హోళీ అనగానే మనందరికి గుర్తుకు వచ్చేది రంగుల పండుగ.. పొద్దున్నే లేచి రంగులు పుసుకుని, రంగు నీటితో ఆనందంగా ఆడుకోవడం మాత్రమే మనకు తెలుసు..కానీ అన్ని ప్రాంతాల్లో హోళీ వేడుకలు ఒకేలా ఉండవు ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది.
* ఒరిస్సా :
ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో రాధా, కృష్ణుడు, విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత హోళీ వేడుకలు ప్రారంభిస్తారు.
* గుజరాత్ :
గుజరాత్ లో ఈ పండగను అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమికూడి మంటలు వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్క సామానులన్నీ తీసుకొచ్చి వేసి అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. మంటల చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు.
* మహారాష్ట్ర :
మహారాష్ట్రలో హోళీక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. హోళీ వేడుకకు ఒక వారం ముందు యవకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి.
* మణిపూర్ :
మణిపూర్ లో ఓ ఆచారం ఉంది. ఇక్కడ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. పండుగ రోజు మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే ఆడపిల్లలు వారి మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ నృత్యం చేస్తారు. అంతేకాదు చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు.
* కాశ్మీర్ :
సైనికుల పహారాలో, తుపాకుల చప్పళ్ళతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీర్ లో సైనికులతో సహా అందరూ హోళీ ఉత్సవాలలో పాల్గొంటారు. ఆటపాటలతో రంగు నీటిని ఒకరిమీద మరొకరు చల్లుకుంటారు.
* పంజాబ్:
పంజాబ్‌లో సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ హోలీని హోలా మోహల్లా అంటారు. వాస్తవానికి, భారత దేశ మొత్తంలో ఆనంద్‌పూర్ సాహిబ్ లో జరిగే హోలీ ఉత్సవం చాలా పేరు పొందింది. విదేశాల నుండి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి వారి సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకొంటారు. ఇక్కడ ఈ పండుగను భారీ ఎత్తున జరుపుకొంటారు.
* ఉత్తర ప్రదేశ్ :
– లఠ్ మార్ హోళీ..
హోళీ పండుగకు ఉత్తర ప్రదేశ్ లోని బర్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి. ఇక్కడ హోళీని వెరైటీగా జరుపుకుంటారు. అక్కడ హోళీ సందర్భంగా రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే క్రీడను ఆడతారు. మహిళలు మగవారిని లాఠీలతో పిచ్చ కొట్టుడు కొడతారట. దీన్నే వారు ‘లఠ్ మార్ హోలీ’ అని ముద్దుగా పిలుచుకుంటారు. లఠ్ అంటే లాటీ అని అర్థమట. దీనికి కూడా ఓ ప్రత్యేక కారణముంది. పురాణములో చిలిపి క్రిష్ణుడు, తనకెంతో ఇష్టమైన రాధ గ్రామానికి వచ్చి, అక్కడ ఆమెను, ఆమె స్నేహితురాళ్ళను ఆటపట్టించాడట. దీనిని తప్పుగా భావించిన ఆ గ్రామం మహిళలు, కర్రలతో క్రిష్ణయ్యను వెంట తరిమారట. అప్పటినుండి, ఈ పండగ ఇలా జరుపుకోవాడం జరుగుతోంది. పక్కనే ఉన్న క్రిష్ణుడి గ్రామం, నంద్‌గావ్ నుండి మగవారు హోళీ ఆడడానికి ఈ గ్రామం రావడం, హుషారుగా హోళీ పాటలు పాడడం, ఆడవారిని రెచ్చగొట్టడం వారిచేతిలో లాఠీ దెబ్బలు తినడం ఆనవాయితీ అన్న మాట. కాకపోతే, ఆడవారు కొట్టే దెబ్బలను వారు ఢోలు వంటి దానిని ఉపయోగించి తప్పించుకోవచ్చు. ఆడవారు కూడా వారిని ఢోలు మీదనే ఎక్కువగా కొడతారు.
ఈ హోళీకి అక్కడ ఒక నెల రోజుల ముందు నుండే ప్రిపరేషన్ జరుగుతుంది. అత్తలు తమ కోడళ్ళకు ఆ నెల రోజు మంచి పౌష్టిక ఆహారం పెడతారట, బాగా కొట్టడానికి. ఇక్కడ కొట్టడం అనేది వారిని గాయపరచడానికి కాదు, వారి పట్ల తమ ప్రేమను చెప్పడానికి మాత్రమే అని చెబుతారు గ్రామస్తులు.
* హర్యానా:
– “కరోర్ మార్” హోళీ..
ఉత్తర ప్రదేశ్ లో లాగానే హర్యానాలో కూడా వింత హోళీ జరుగుతుందట. దాని పేరు “కరోర్ మార్” హోళీ. ఇక్కడ వదిన, మరదళ్ళూ మరుదులను, బావలను పిచ్చ కొట్టుడు కొట్టడం స్పెషాలిటీ అంట. సంవత్సరమంతా వారు తమ మీద వేసిన జోకులకూ సెటైర్లకూ ఆరోజు కసి తీర్చుకుంటారన్న మాట. ఇది కేవలం కుటుంబమంతా తమ విభేదాలను మర్చిపోయి, కలిసి మెలసి జీవించడనికి చేసుకునే పండగ అని, ఇది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయమనీ చెబుతున్నారు. విశేషమేమిటంటే, లాఠ్ మార్ హోళీ లా ఇక్కడ మగవారు ఢోలు లాంటివి తెచ్చుకోరు..ఏది దొరికితే అది అడ్డుపెట్టుకొని తప్పించుకోవాలి, లేదా తన్నులు తినాలి.
1NTR30: తారక్ ఫ్యాన్స్ సంబరాలు.. రెట్టింపు చేసిన కొరటాల!
2Elon Musk: “అందరూ అనుకున్నట్టు కాదు.. అసలు నిజం వేరే ఉంది”
3Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
4YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్
5Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
6Arjun Sarja: హీరోయిన్ గా అర్జున్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే?
7Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
8Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా
9Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
10Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
-
Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!