లడఖ్ వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ టీం డాక్టర్‌ సస్పెండ్

  • Published By: Subhan ,Published On : June 17, 2020 / 11:01 AM IST
లడఖ్ వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ టీం డాక్టర్‌ సస్పెండ్

చెన్నై సూపర్ కింగ్స్ బుధవారం టీం డాక్టర్ అయిన మధు తొట్టప్పిల్లిల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసింది. లడఖ్ వివాదంలో 20 ఇండియన్ ఆర్మీ అధికారులు కోల్పోవడంపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. దీనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్కే యాక్షన్ తీసుకుంది. టీంలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ మాత్రమే కాదు ఆర్మీలో లెఫ్టినెంట్ హోదా కలిగిన వ్యక్తి కూడా. 

ఈ మేరకు సీఎస్కే తన అధికారిక ట్విట్టర్ పేజిలో సస్పెన్షన్ పై పోస్టు పెట్టింది. ఈ జట్టు యజమాని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్. 

‘చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌కు డా.మధు తొట్టప్పిల్లి పర్సనల్ ట్వీట్‌కు ఎటువంటి సంబంధం లేదు. అతణ్ని టీం డాక్టర్ పొజిషన్ నుంచి సస్పెండ్ చేశాం. చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ పై స్పందిస్తూ.. నాలెడ్జ్ లేకుండా, బ్యాడ్ టేస్ట్‌తో వ్యవహరించేవాళ్లను మన్నించబోదు’ అని ట్వీట్ చేసింది. తొట్టిపల్లి ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి జట్టుతో పాటే ఉంటున్నారు. అంతేకాకుండా ఆయన స్పోర్ట్స్ మెడిసిన్ లో స్పెషలిస్ట్ కూడా.

మంగళవారం గాల్వాన్ లోయలో ఘటనపై రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తొట్టిప్పిల్లి ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికి ట్వీట్ డిలీట్ చేసి అకౌంట్ ను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. సోమవారం రాత్రి చనిపోయిన 20మంది ఆర్మీ వ్యక్తుల్లో ఓ కల్నల్ కూడా ఉన్నారు. ఇరు మిలటరీ వర్గాల మధ్య 1967నుంచి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. 

1967లో నాథు లా ప్రాంతంలో జరిగిన వివాదంలో భారత్ సైనికులు 80మంది చనిపోగా చైనీస్ ఆర్మీ పర్సనల్ లు 300మంది ప్రాణాలు కోల్పోయారు. 

Read: సెప్టెంబరు నెలాఖరులో IPL 2020కి రెడీ అవుతోన్న BCCI