Chhattisgarh : కూతురు మృతదేహాన్ని భుజాన మోస్తూ 10 కిలోమీటర్లు నడిచి ఇంటికి తీసుకెళ్లిన తండ్రి

కూతురు మృతదేహాన్ని భుజాన మోస్తూ 10 కిలోమీటర్లు నడిచి ఇంటికి తీసుకెళ్లా తండ్రి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Chhattisgarh : కూతురు మృతదేహాన్ని భుజాన మోస్తూ 10 కిలోమీటర్లు నడిచి ఇంటికి తీసుకెళ్లిన తండ్రి

Chhattisgarh Man Seen Carrying Daughter's Body For 10 Km

Chhattisgarh Man Seen Carrying Daughter’s Body For 10 Km : అభివృద్ధి చేశాం అని చెప్పుకునే ప్రభుత్వాలు ఆస్పత్రుల్లో ఈనాటికి ఎటువంటి సౌకర్యాలు లేని పరిస్థితి. అంబులెన్సులు ఉండవ్. సరైన సమయానికి డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉండరు.వారి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల తీరు ఉంది. ఆఖరికి అంబులెన్స్ లు కాదు కదా..ఆస్పత్రిలో ఎవరైనా చనిపోతే వారిని ఇంటికి తరలించటానికి ‘అంతిమ యాత్ర’ వాహనాలు కూడా లేదు దుస్థితుల్లో ఉన్నాయి ప్రభుత్వ ఆస్పత్రులు. ఇటువంటి దారుణ దుస్థితే ఓతండ్రి చనిపోయిన తన ఏడేళ్ల కూతురిని భుజాలపై మోస్తూ 10 కిలోమీటర్లు కాలినడకన తన ఇంటికి తీసుకెళ్లిన ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది..

Also read : Chhattisgarh HC : భూకబ్జా కేసులో నోటీసులు..కోర్టు విచారణకు హాజరైన ‘పరమశివుడు’..!

త్తీస్‌గ‌ఢ్‌లోని సుర్గుజా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ తండ్రికి దారుణ పరిస్థితి వచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు.. ఆ తండ్రి కళ్ల ముందే ప్రాణాలు విడిచింది.. ఆ దారుణ పరిస్థితి చూసిన ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది.. గుండెల్లోంచి పుట్టెడు దుఃఖం తన్నుకొచ్చింది.. గుండెలవిసేలా ఏడ్చాడు..శవాన్ని ఇంటికి తీసుకెళ్లటానికి సిద్ధమయ్యారు. వాహనం కోసం ఆస్పత్రి సిబ్బందిని అడిగాడు. లేదని చెప్పారు. బతిమాలాడు.కన్నీటితో వేడుకున్నాడు. కానే ఫలితం శూన్యం. దీంతో ఏడేళ్ల కూతురు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి భుజాలకెత్తుకున్నాడు.. దుఃఖాన్ని దిగమింగుకుని నడక మొదలెట్టాడు.. అలా.. అలా..ఒకటి రెండు కాదు ఏకంగా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి చేరాడు…ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇదికాస్త ప్ర‌భుత్వం దృష్టికి వెళ్లటంతో విచార‌ణ‌కు ఆదేశించారు అధికారులు. అనారోగ్యంతో ఏడేళ్ల బాలిక ల‌ఖాన్‌పూర్ గ్రామంలోని క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్లో శుక్రవారం (మార్చి 25,2022) ఉద‌యం ప్రాణాలు కోల్పోయింది.

Also read : Visakha Railway Zone: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

దీంతో కూతురు మృత‌దేహాన్ని తండ్రి భుజాల‌పై మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. దీనిపై ఆసుప‌త్రి సిబ్బంది మాట్లాడుతూ… అంబులెన్సు త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని, అందులో మృత‌దేహాన్ని తీసుకెళ్తార‌ని చెప్పామ‌ని..కానీ ఆ తండ్రి బాలిక మృత‌దేహాన్ని భుజానికెత్తుకుని తీసుకెళ్లాడ‌ని చెబుతున్నారు.

దీనిపై స్పందించిన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో మాట్లాడుతూ… ఈ ఘటనపై విచార‌ణ‌కు ఆదేశించామ‌ని తెలిపారు. ఈ దారుణ ఘటనలో హెల్త్ సెంట‌ర్ నిర్ల‌క్ష్యం ఉంద‌ని తేలితే..ఆ సెంట‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.