Rahul Jodo Yatra : ‘విద్వేషం చోడో.. భారత్ జోడో’.. భారత్‌కు కొత్త రాహుల్‌ని పరిచయం చేసిన జోడో యాత్ర

భారత్ జోడో యాత్రలో అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు. అతనిలో.. ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. జనంతో ఇంటరాక్ట్ అవుతున్న తీరు కూడా అందరినీ ఆలోచింపజేస్తోంది. తనను కలిసేందుకు వచ్చిన వారితో రాహుల్ మెలుగుతున్న తీరు, జనంతో కలిసి అతను వేస్తున్న అడుగులు, వారితో మాట్లాడుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ వెళ్లడం.. ఓ కొత్త రాహుల్‌ను పరిచయం చేసింది. ఈ భారత్ జోడో యాత్ర..

Rahul Jodo Yatra : ‘విద్వేషం చోడో.. భారత్ జోడో’.. భారత్‌కు కొత్త రాహుల్‌ని పరిచయం చేసిన జోడో యాత్ర

Rahul Bharath Jodo Yatra

Rahul Bharath Jodo Yatra : దేశం మొత్తం కాంగ్రెస్ పనైపోయిందనే ఫీలింగ్‌లో ఉన్న టైంలో.. రాహుల్ భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు. ఈ ఒక్క పరిణామం.. కాంగ్రెస్ పార్టీకి, కేడర్‌కు ఫుల్ బూస్ట్ ఇచ్చింది. సౌత్‌లో వస్తున్న రెస్పాన్సే ఇందుకు బిగ్ ఎగ్జాంపుల్. రాహుల్ పాదయాత్ర మొదలుపెట్టాక.. కాంగ్రెస్ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో.. కచ్చితంగా హస్తం పార్టీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుందని నమ్ముతున్నారు.

ఓ వైపు భారత్‌ జోడో అంటూనే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్వ వైభవం తెచ్చేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే.. దేశం మొత్తం సైలెంట్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని.. జోడో యాత్ర పేరుతో సైరన్ మోగించి మరీ లేపారు. కాంగ్రెస్ సభ్యుడిగానే భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నానంటూ.. కార్యకర్తలతో మమేకమవుతూ.. పీసీసీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో పార్టీని పటిష్టం చేసి.. ఆలిండియా స్థాయిలో కాంగ్రెస్‌ని మళ్లీ అధికారంలోకి తేవడమే రాహుల్ టార్గెట్‌గా కనిపిస్తోంది. ఇందుకోసమే.. భారత్ జోడో అంటూ బయల్దేరారు. ప్రజలను నేరుగా కలుస్తున్నారు. వారితో మమేకమవుతూ.. జనం కష్ట సుఖాలను తెలుసుకుంటున్నారు.

రాహుల్ గాంధీ జోడో యాత్ర వెనుక కనిపించని ప్రధాన లక్ష్యాలు మూడున్నాయ్. ఒకటి.. దేశవ్యాప్తంగా పార్టీకి పునర్‌వైభవం తేవాలి. రెండోది.. 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలి. మూడోది.. బలమైన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని ఢీకొట్టాలి. అంతేకాదు.. రాబోయే ఏడాదిన్నరలో 11 రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గనక.. కాంగ్రెస్ ఇంపాక్ట్ చూపగలిగితే.. జోడో యాత్ర సక్సెస్ అయినట్లే లెక్క. ఎందుకంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. గడిచిన ఎనిమిదిన్నరేళ్లలో.. పార్టీని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో హస్తం పట్టు కోల్పోయింది. ఏ ఎన్నికల్లోనూ.. పెద్దగా ప్రభావం చూపడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చవిచూడటంతో.. లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించాలంటే.. చాలా పెద్దగా ఇంపాక్ట్ చూపాల్సి ఉంటుంది. అందుకు.. రాహుల్ ఎంచుకున్న మార్గమే భారత్ జోడో యాత్ర.

వాస్తవానికి.. భారత్ జోడో యాత్రలో అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు. అతనిలో.. ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. జనంతో ఇంటరాక్ట్ అవుతున్న తీరు కూడా అందరినీ ఆలోచింపజేస్తోంది. తనను కలిసేందుకు వచ్చిన వారితో రాహుల్ మెలుగుతున్న తీరు, జనంతో కలిసి అతను వేస్తున్న అడుగులు, వారితో మాట్లాడుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ వెళ్లడం.. ఓ కొత్త రాహుల్‌ను పరిచయం చేసింది. ఈ భారత్ జోడో యాత్ర.. రాహుల్‌లో వచ్చిన మార్పును.. దేశం మొత్తానికి చూపిస్తోంది. ఇప్పటిదాకా ప్రచారం జరిగినట్లుగా.. అతను అమ్మచాటు బిడ్డ కాదని.. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరినీ.. ప్రేమాభిమానాలతో కలుపుకొని పోయే నాయకుడని విశ్వసిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే.. చాలా మంది విద్యార్థులు, యువతీ, యువకులు, మేధావులంతా.. రాహుల్ జోడో యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అతనితో కలిసి.. కిలోమీటర్ల మేర నడుస్తున్నారు.

Bharat jodo yatra : భారత్ జోడో యాత్రలో కొత్త మైల్ స్టోన్ .. 50 రోజులు..1300 కిలోమీటర్లకు పైగా సాగిన రాహుల్ యాత్ర

ఈ జోడో యాత్రతో.. ప్రజలను దగ్గర్నుంచి గమనించే అవకాశం రాహుల్‌కు వచ్చింది. ఇదే సమయంలో.. అదే జనానికి.. రాహుల్‌ని కూడా దగ్గర్నుంచి చూసే అవకాశం, ఆయన్ని గమనించే చాన్స్ కూడా దొరికాయ్. జనంతో.. అతనెలా మెలుగుతున్నారు.? పబ్లిక్‌లో ఎలా ప్రవర్తిస్తున్నారు? కార్నర్ మీటింగుల్లో.. కేడర్‌కి ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారనే మొత్తం.. పబ్లిక్ గమనిస్తున్నారు. బీజేపీతో పాటు జోడో యాత్ర సాగుతున్న రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలపై.. రాహుల్ చేస్తున్న కామెంట్స్ కూడా ఎంతో విమర్శనాత్మకంగానే ఉంటున్నాయ్. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. బీజేపీ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తోందంటూ.. జనానికి కనెక్ట్ అయ్యే డైలాగులు పేలుస్తున్నారు. విద్వేషంతో కాదు.. ప్రేమతో.. ఈ దేశాన్ని ఏకం చేసేందుకే.. తాను ఈ జోడో యాత్రను మొదలుపెట్టానని వివరిస్తున్నారు. దీంతో.. ఇప్పటిదాకా రాహుల్‌పై ఉన్న ఒపినీయన్ కూడా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా.. రాహుల్ జోడో యాత్రకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు.

ఇప్పుడు.. సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు.. ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క హోప్ రాహుల్ జోడో యాత్ర. అతని వరకు ఇది.. పెద్ద సవాలే. అయినా.. స్వీకరించారు. రోజుకో మైల్ స్టోన్ దాటుతున్నారు. ఇటీవలి కాలంలో.. బీజేపీపై కాంగ్రెస్ జరిపిన అతిపెద్ద దాడిగా రాహుల్ జోడో యాత్రను వర్ణిస్తున్నారు. రాహుల్ యాత్రకు సౌత్ స్టేట్స్‌లో వస్తున్న రెస్పాన్స్ కూడా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈసారి.. నేషనల్ లెవెల్‌లో కచ్చితంగా.. ఎంతో కొంత మార్పు చూడబోతున్నామనే టాక్ కూడా మొదలైంది. భారత్ జోడో యాత్ర టార్గెట్లలో.. కొంత మేర సాధించినా.. రాహుల్ యాత్ర గ్రాండ్ సక్సెస్ అయినట్లేనన్న చర్చ సాగుతోంది.

రాహుల్ జోడో యాత్రతో.. దక్షిణాది రాష్ట్రాల్లోని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీకి పునర్వైభవం వస్తుందని బలంగా నమ్ముతున్నారు. సౌత్‌లో ఒక్క తమిళనాడు మినహాయిస్తే.. మిగతా స్టేట్స్‌లో ముందు నుంచే హస్తానికి కొంత పట్టుంది. రాహుల్ యాత్రతో.. అది ఇంకొంత రెట్టింపవుతుందని పీసీసీ నేతలు నమ్ముతున్నారు. అదేమంత పెద్ద మ్యాటర్ కాదు. తెలంగాణ తర్వాత.. రాహుల్ యాత్ర నార్త్ ఇండియాలో ఎంటర్ కాబోతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల గుండానే.. భారత్ జోడో యాత్ర సాగాల్సి ఉంది. అక్కడ.. కాంగ్రెస్ పార్టీని బిగ్ బూస్ట్ ఇవ్వడమే ఇప్పుడు రాహుల్ ముందున్న టార్గెట్. అంతేకాదు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను నిలబెట్టాలంటే.. పాదయాత్రకు మించిన ఆప్షన్ మరొకటి లేదు. అందుకే.. రాహుల్ దీనిని ఎంచుకున్నారు. జోడో యాత్రతో.. దేశం మొత్తం ఇప్పుడు రాహుల్ గురించే చర్చించుకుంటోంది. ఆ విషయంలో రాహుల్ ఇప్పటికే.. సక్సెస్ అయ్యారు. అయితే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి నార్త్, సౌత్ అనే తేడా లేకుండా.. కాంగ్రెస్‌ ఇండియా వైడ్ స్వింగ్‌లోకి వస్తే.. రాహుల్ డబుల్ సక్సెస్ అయినట్లేనన్న చర్చ జరుగుతోంది.

రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర.. సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారి దగ్గర ప్రారంభమైంది. అక్కడి నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ను దాటి తెలంగాణలోకి ఎంటరైంది. ఇప్పటివరకు 5 రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో 13 వందల కిలోమీటర్లకు పైగా రాహుల్ యాత్ర కొనసాగింది. తెలంగాణలోకి ఎంటరైన తర్వాత.. జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా కొనసాగుతూ ఉంది.

మొత్తం.. 150 రోజుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 12 రాష్ట్రాల్లో 3 వేల 570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలన్నదే రాహుల్ టార్గెట్. అలా.. తమిళనాడులో 2 జిల్లాలు, కేరళలో 7, కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్‌లో 2 జిల్లాల్లో భారత్ జోడో యాత్ర పూర్తయింది. అక్కడ.. రాహుల్ యాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇండియా మొత్తం చూసింది. ముఖ్యంగా.. కేరళ, కర్ణాటకలో రాహుల్‌ను చూసేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. ప్రస్తుతం.. తెలంగాణలోనూ అలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ.. నవంబర్ ఏడో తేది వరకు రాహుల్ యాత్ర కొనసాగనుంది. తెలంగాణలోనూ యాత్ర పూర్తయితే.. మొత్తంగా 5 రాష్ట్రాలు, 26 జిల్లాల్లో.. 1670 కిలోమీటర్ల మేర యాత్ర సాగినట్లవుతుంది. నవంబర్ 7న రాహుల్ మహారాష్ట్రలోకి ప్రవేశిస్తారు.

తెలంగాణలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా.. మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్ జోడో యాత్ర సాగేలా రూట్ మ్యాప్ డిజైన్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఇందులో భాగంగా.. కొన్ని ప్రాంతాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. రాహుల్ పాదయాత్రలో అతిపెద్ద నగరం హైదరాబాద్ కావడం విశేషం. నెక్లెస్ రోడ్‌లో టీపీసీసీ సభ కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ.. రాహుల్ ఏం మాట్లాడతారన్నదే.. స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తిగా మారింది.