Bharat jodo yatra : భారత్ జోడో యాత్రలో కొత్త మైల్ స్టోన్ .. 50 రోజులు..1300 కిలోమీటర్లకు పైగా సాగిన రాహుల్ యాత్ర

విద్వేషం చోడో.. భారత్ జోడో. ఇదే నినాదంతో..రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో 50 రోజులు పూర్తి చేసుకున్నారు. 19 జిల్లాలను క్రాస్ చేసి . 4 రాష్ట్రాలను దాటేసి.. ఐదో స్టేట్‌లోకి ఎంటరైపోయారు. ఈ 50 రోజుల్లో.. 1300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు రాహుల్. ఈ లాంగ్ జర్నీలో.. లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే ఎన్నో మజిలీలున్నాయ్. అంతకుమించి.. రాహుల్‌పై ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలున్నాయ్. కొత్త రాహుల్‌ను చూపిస్తున్నాయ్.

Bharat jodo yatra : భారత్ జోడో యాత్రలో కొత్త మైల్ స్టోన్ .. 50 రోజులు..1300 కిలోమీటర్లకు పైగా సాగిన రాహుల్ యాత్ర

Rahul gandhi Bharat jodo yatra

Rahul gandhi Bharat jodo yatra : అలుపు లేదు.. వేరే ఆలోచన లేదు.. ఉన్నదల్లా ఒక్కటే.. విద్వేషం చోడో.. భారత్ జోడో. ఇదే నినాదంతో.. 50 రోజులు నడిచేశారు. 19 జిల్లాలను క్రాస్ చేసేశారు. 4 రాష్ట్రాలను దాటేసి.. ఐదో స్టేట్‌లోకి ఎంటరైపోయారు. ఇంకా.. ఇంకా.. నడుస్తూనే ఉన్నాడు. అతనే.. రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర మొదలై 50 రోజులు దాటింది. ఈ 50 రోజుల్లో.. 13 వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు రాహుల్. ఈ లాంగ్ జర్నీలో.. లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే ఎన్నో మజిలీలున్నాయ్. అంతకుమించి.. రాహుల్‌పై ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలున్నాయ్. కొత్త రాహుల్‌ను చూపిస్తున్నాయ్.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర.. విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో.. రాహుల్ ఎన్నో మైలురాళ్లను క్రాస్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో.. రాహులో జోడో యాత్ర కూడా ఓ కీలక మైలురాయిని దాటేసింది. అదే.. 50 డేస్. రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలై.. 50 రోజులు దాటింది. చిన్న దీపావళి బ్రేక్ తర్వాత.. ఫార్వార్డ్‌ అవుతున్న రాహుల్ జోడో యాత్రను.. ఓ 50 రోజులు రివైండ్ చేసి చూస్తే.. ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయ్.

విద్వేషం చోడో.. భారత్ జోడో.. అనే నినాదం మీదే.. రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. నేతలతో, కార్యకర్తలతో కలిసి.. జనం సమస్యలను, ఇబ్బందులను దగ్గరి నుంచి తెలుసుకునేందుకే.. తాను ఈ జోడో యాత్ర మొదలుపెట్టాలని రాహుల్‌ చెప్పారు. అందుకనుగుణంగా.. దారిపొడవునా.. అందరినీ కలుస్తూ ముందుకుసాగుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఈ జర్నీలో.. అప్పుడే 50 రోజులు పూర్తయిపోయింది. దీనిని.. మైల్ స్టోన్‌ని.. కాంగ్రెస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు.. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

తెలంగాణ మాత్రమే కాదు.. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీలో.. రాహుల్ యాత్రకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోందని.. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జనం కూడా.. రాహుల్ గాంధీని చూసేందుకు తరలివస్తున్నారు. ఎప్పుడూ.. ఢిల్లీలో ఉంటూ.. టీవీల్లో మాత్రమే కనిపించే రాహుల్ గాంధీ.. ఇప్పుడు తమ ఊరికి, తమ గల్లీకి వస్తున్నాడని తెలిసి.. ప్రతి ఊళ్లో, పట్టణంలో.. ఆయన్ని చూసేందుకు వస్తున్నారు. ఇందులో.. కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటున్నారు. రాహుల్ అభిమానులు ఉంటున్నారు. సాధారణ జనం కూడా ఉంటున్నారు. మేం మీతోనే ఉన్నామంటూ.. ప్లకార్డులు పట్టుకొని మరీ రాహుల్‌కు వెల్‌కమ్ చెబుతున్నారు.

Rahul Jodo Yatra : ‘విద్వేషం చోడో.. భారత్ జోడో’.. భారత్‌కు కొత్త రాహుల్‌ని పరిచయం చేసిన జోడో యాత్ర

ప్రతి రోజూ ఉదయం ఆరున్నర గంటలకే.. రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలవుతుంది. అలా.. దారిలో ఎంతో మందిని కలుస్తూ ముందుకు సాగుతున్నారు రాహుల్. చిన్నారులను ఎత్తుకుంటున్నారు. వారితో సరదాగా గడుపుతున్నారు. కొందరు చిన్నారులనైతే.. తన భుజాల మీదకెత్తుకొని మరీ కొంత దూరం నడిచారు. తనను చూసేందుకు, కలిసేందుకు వచ్చిన మహిళల నుంచి.. వారి సమస్యలను, ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల మీదుగా యాత్ర సాగే సమయంలో.. తనను చూసేందుకు వచ్చే వృద్ధులను కూడా రాహుల్ తీరిగ్గా కలుస్తున్నారు. వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. యంగ్ జనరేషన్‌తోనూ రాహుల్ ఇంటరాక్ట్ అవుతున్నారు. జోడో యాత్రలో అందరినీ భాగం చేసుకుంటూ.. తనతో కలిసి నడిచే వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. జనం అభిప్రాయాలను తానే స్వయంగా తెలుసుకుంటున్నారు. పబ్లిక్ లైఫ్‌ని, వారికున్న ఇబ్బందులను చాలా దగ్గర్నుంచి పరిశీలిస్తున్నారు.

రాహుల్ కూడా జోడో యాత్రలో.. ఎంతో ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ఆ జోష్‌తోనే.. 13 వందల కిలోమీటర్లకు పైగా దాటేశారు. తనను చూసేందుకు వచ్చిన జనానికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాహుల్‌ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు.. కూడా పోటీ పడుతున్నారు. మార్గం మధ్యలో రాహుల్‌తో సెల్ఫీలు దిగేందుకు యూత్ పోటీ పడుతున్నారు. విద్యార్థులు, స్థానిక ప్రజలు, రైతులు, రైతు కూలీలతోనూ రాహుల్ ముచ్చటిస్తున్నారు. లోకల్‌గా ఉండే సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు.. కొన్ని చోట్ల కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలతోనూ, ప్రజలతోనూ మమేకమవుతున్నారు. ఇక.. రాహుల్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర.. సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారి దగ్గర ప్రారంభమైంది. అక్కడి నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ను దాటి తెలంగాణలోకి ఎంటరైంది. ఇప్పటివరకు 5 రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో 13 వందల కిలోమీటర్లకు పైగా రాహుల్ యాత్ర కొనసాగింది. తెలంగాణలోకి ఎంటరైన తర్వాత.. జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా కొనసాగుతూ ఉంది.

మొత్తం.. 150 రోజుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 12 రాష్ట్రాల్లో 3 వేల 570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలన్నదే రాహుల్ టార్గెట్. అలా.. తమిళనాడులో 2 జిల్లాలు, కేరళలో 7, కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్‌లో 2 జిల్లాల్లో భారత్ జోడో యాత్ర పూర్తయింది. అక్కడ.. రాహుల్ యాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇండియా మొత్తం చూసింది. ముఖ్యంగా.. కేరళ, కర్ణాటకలో రాహుల్‌ను చూసేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. ప్రస్తుతం.. తెలంగాణలోనూ అలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ.. నవంబర్ ఏడో తేది వరకు రాహుల్ యాత్ర కొనసాగనుంది. తెలంగాణలోనూ యాత్ర పూర్తయితే.. మొత్తంగా 5 రాష్ట్రాలు, 26 జిల్లాల్లో.. 1670 కిలోమీటర్ల మేర యాత్ర సాగినట్లవుతుంది. నవంబర్ 7న రాహుల్ మహారాష్ట్రలోకి ప్రవేశిస్తారు.

తెలంగాణలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా.. మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్ జోడో యాత్ర సాగేలా రూట్ మ్యాప్ డిజైన్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఇందులో భాగంగా.. కొన్ని ప్రాంతాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. రాహుల్ పాదయాత్రలో అతిపెద్ద నగరం హైదరాబాద్ కావడం విశేషం. నెక్లెస్ రోడ్‌లో టీపీసీసీ సభ కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ.. రాహుల్ ఏం మాట్లాడతారన్నదే.. స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తిగా మారింది.