Conflict : భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు.. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. పోలీసుల ఎంట్రీతో కథ సుకాంతం

సోషల్ మీడియాలో భర్త షేర్ చేసిన ప్రతి పోస్టును ఓ మహిళ లైక్ చేస్తుండటంతో భార్యకు చిర్రెత్తుకొచ్చింది. ఆ మహిళ ఎవరని నిలదీసింది. ఇద్దరిమధ్య ఘర్షణ జరిగి వ్యవహారం పోలీసులవరకు చేరింది

Conflict : భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు.. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. పోలీసుల ఎంట్రీతో కథ సుకాంతం

Conflict

Conflict : సోషల్ మీడియాలో తమ పోస్టులకు వచ్చే లైక్స్ చూసి మురిపోతుంటారు కొందరు. తమ స్నేహితులతో ఈ విషయాన్నీ షేర్ చేసుకుంటారు. వారు పెట్టిన పోస్ట్ స్క్రీన్‌షాట్ తీసుకోని గుర్తుగా పెట్టుకుంటారు. ఇక లైక్స్ రాకపోతే బాధపడే బ్యాచ్ కూడా ఉంది. తమ పోస్టును ఎవరు లైక్ చేయడంలేదంటూ మదనపడుతుంటారు. ఇక కొందరు తమ వారికి లైక్స్ వస్తే అనుమానపడుతుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. అక్టోబరు 22న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చదవండి : Husband Cheating Wife : ప్రేమ, పెళ్లి పేరుతో గర్భవతిని చేసి పారిపోయిన భర్త

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడొదరకు చెందిన దంపతులకు సోషల్ మీడియాలో వేర్వేరు ఖాతాలు ఉన్నాయి. అయితే భర్త చేసిన ప్రతి పోస్టుకి వేరే మహిళ లైక్ చేస్తుంది. దీంతో భర్త కతపై నజర్ పెట్టింది భార్య.. భర్త చేసిన ప్రతి పోస్టుకే క్షణాల వ్యవధిలో లైక్ కొడుతుండటంతో భార్యకు కోపమొచ్చింది. భర్త ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టింది. దీంతో ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగింది. మాటలు పెరిగి ఘర్షణకు దారి తీసింది.. భర్త భార్యపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆమెకు రక్తపు గాయాలయ్యాయి.

చదవండి : Social Media Fraudsters : చదివింది టెన్త్ క్లాస్… ఆన్‌లైన్ మోసాల్లో మాస్టర్ డిగ్రీ

దీంతో సదరు మహిళ రాష్ట్రంలో మహిళల రక్షణ కొరకు నడుపుతున్న అభయం అనే పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. ఆమె ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి భార్యపై చేయిచేసుకుంటే కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో భార్యకు కూడా చివర్లు పెట్టారు. భర్త చేసే ప్రతి పనిని అనుమానించవద్దని సూచించారు. సోషల్ మీడియాలో తెలిసిన వారు లైక్స్ చేయడం సాధారణ విషయమని.. అలాంటి వాటిని సాకులుగా చూపుతూ జీవితాలు ఆగం చేసుకోవద్దని తెలిపారు.