UP Elections : కాంగ్రెస్ కీలక నిర్ణయం.. యూపీలో సభలు, సమావేశాలు రద్దు

అయితే రాహుల్ గాంధీ డిసెంబర్ 29న ఇటలీకి వెళ్లారు. కాంగ్రెస్, గాంధీ వారసుడు గైర్హాజరుపై ఒక ప్రకటన విడుదల చేసింది ఆ పార్టీ. ఇక ఈ నేపథ్యంలోనే పలు సభలు రద్దు చేసింది.

UP Elections : కాంగ్రెస్ కీలక నిర్ణయం.. యూపీలో సభలు, సమావేశాలు రద్దు

Up Elections

UP Elections : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సభలు సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిచింది.

చదవండి : UP Elections: ఉచిత విద్యుత్ ఇస్తామంటున్న పార్టీ

కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల ఆరోగ్యం రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ కాంగ్రెస్ కమిటీ.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రధాన కార్యదర్శి సుశీల్ చంద్రకు లేఖ రాసింది. లడ్కీ హన్ లడ్ శక్తి హన్ మారథాన్ లతోపాటు జనవరి 15న లక్నోలో పార్టీ నిర్వహించాల్సిన మెగా ర్యాలీ కూడా వాయిదా వేసినట్లు పేర్కొంది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో నోయిడా, వారణాసి తోపాటు రాష్ట్రాలలోని అనేక ఇతర జిల్లాల్లో ప్లాన్ చేసిన 8 మారథాన్‌లను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

చదవండి : UP Elections 2022 : యూపీలో ఎన్నికలు జరిగేనా..! పోలీసులతో ఈసీ చర్చలు

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని అన్ని పీసీసీలు తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితిని అంచనా వేయాలని, ఆపై ర్యాలీలు మరియు బహిరంగ కార్యక్రమాలను వాయిదా వేయాలని AICC తెలిపింది. అయితే రాహుల్ గాంధీ డిసెంబర్ 29న ఇటలీకి వెళ్లారు. కాంగ్రెస్, గాంధీ వారసుడు గైర్హాజరుపై ఒక ప్రకటన విడుదల చేసింది ఆ పార్టీ. అతను కొద్ది రోజుల పాటు ‘చిన్న వ్యక్తిగత పర్యటన’ కోసం విదేశాలకు వెళ్లినట్లు స్పష్టం చేసింది. అయితే రాహుల్ లేకపోవడంతోనే సభలు క్యాన్సిల్ చేసినట్లుగా పార్టీలోని కొందరు చెబుతున్నారు.

ప్రియాంక ఒక్కరే సభలు సమావేశాలకు హాజరవుతున్నారు. ఇక మొత్తం ఒక్కరితో సాధ్యం కాకపోవడంతో పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక సుడిగాలి పర్యటన చేస్తున్నారు.