Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల.. అక్టోబర్ 17న ఎన్నిక

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 17న ఎన్నిక జరుగుతుంది. పోటీలో ఎవరు నిలుస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల.. అక్టోబర్ 17న ఎన్నిక

Congress President Polls: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం నిర్వహించనున్న ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 శనివారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 24-30 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

Quadruplets Joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఒడిశాలో జన్మనిచ్చిన మహిళ

నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 1 వరకు జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 8. తర్వాత పోటీలో నిలిచిన అభ్యర్థులు, గుర్తులు కేటాయిస్తారు. ఒక్కరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడితే ఎన్నిక నిర్వహిస్తారు. అక్టోబర్ 17న ఎన్నిక జరుగుతుంది. అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నిక తర్వాత ప్రస్తుతం అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సోనియా గాంధీ ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటారు. సోనియా గాంధీ 1998 నుంచి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. మధ్యలో 2017-2019 వరకు మాత్రం సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో ఈ పదవికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

Fighting In Ghaziabad: రోడ్డుపై ఘర్షణ పడుతున్న కుర్రాళ్లపైకి దూసుకొచ్చిన కారు.. యాక్సిడెంట్ అయినా ఆగని గొడవ.. వీడియో వైరల్

అలాగే రాహుల్ గాంధీ కూడా ఈ పదవిపై ఆసక్తి చూపించడం లేదు. దీంతో కొత్త అభ్యర్థిని అధ్యక్షుడిగా చేయాలని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చివరిసారిగా 2000 సంవత్సరలో అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో జితేంద్ర ప్రసాదపై సోనియా గాంధీ విజయం సాధించారు. కాగా, ఈ సారి ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. పార్టీ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, శశి థరూర్, దిగ్విజయ్ సింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో శశి థరూర్ ఈ ఎన్నికలో పోటీ చేసేందుకు నో చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.