పెళ్లికూతురు ట్వీట్ కు స్పందించిన రాష్ట్రపతి…నెటిజన్ల ప్రశంసలు

  • Published By: venkaiahnaidu ,Published On : January 6, 2020 / 04:13 PM IST
పెళ్లికూతురు ట్వీట్ కు స్పందించిన రాష్ట్రపతి…నెటిజన్ల ప్రశంసలు

ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను పరిష్కరించిన కోవింద్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఇంతకీ రాష్ట్రపతికి భవన్ కు ఆ పెళ్లికూతరు ట్వీట్ ఎందుకు చేసింది…కోవింద్ ఏం చేశారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా?

సాధారణంగా హైలెవల్ మీటింగ్ అంటే సెక్యూరిటీ ఎంతో హడావుడిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి,ప్రధాని,కేంద్రమంత్రుల సమావేశం అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లు ెక్కడ మీటింగ్ నిర్వహించాలనుకుంటే సెక్యూరిటీ అధికారులు కొద్ది రోజుల ముందే ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహించి ఆ ఏరియాలో సామాన్యుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తారు. ఇక హోటల్స్ అయితే సెక్యూరిటీ కారణాలతో సాధారణ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తారు. అయితే ఓ హోటల్ లో పెళ్లి పెట్టుకున్న ఓ జంటకు ఇలాంటి సమస్యే ఎదురైంది.

అమెరికాకు చెందిన యాష్లే హోల్ అీనే యువతికి కేరళ రాష్ట్రానికి చెందిన అభితో పెళ్లి కుదిరింది. మంగళవారం(జనవరి-7,2020)కొచ్చిలోని తాజ్ హోటల్ లో వేదికగా వీరి వివాహం జరగాల్సి ఉన్న సమయంలో అదే రోజు రాష్ట్రపతికి ఆ హోటల్ లోని విడిది ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ కారణాల వల్ల 48 గంటల్లోగా వివాహ వేదికను మార్చుకోవాలని అధికారులు పెళ్లి వారికి సూచించారు. దీంతో యాష్లే తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. సెక్యూరిటీ అధికారుతో మాట్లాడి తమ వివాహం సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్రపతి భవన్ వర్గాలను కోరుతూ ట్వీట్ చేసింది. అయితే  మీ వివాహనానికి ఎలాంటి ఆటంకం లేదు. సమస్య పరిష్కరించబడిందంటూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ ద్వారా రిప్లై ఇచ్చింది. గౌరవ రాష్ట్రపతి ఆశీర్వాదంతో తమ పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతోందంటూ స్థానిక అధికారులకు,హోటల్ మేనేజ్ మెంట్ కి యాష్లే ధన్యవాదాలు తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోవింద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతిథి దేవోభవకు నిజమైన అర్థం అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.