Lord Shiva: ప్రభుత్వభూమిని ఆక్రమించారంటూ “పరమశివుడికే” కోర్టు నోటీసు

ప్రభుత్వ భూమిని కబ్జాచేశారంటూ సాక్షాత్తు పరమశివుడికే కోర్టు సమన్లు జారీ చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్లోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.

Lord Shiva: ప్రభుత్వభూమిని ఆక్రమించారంటూ “పరమశివుడికే” కోర్టు నోటీసు

Lord Shiva

Lord Shiva: తప్పులు చేసే కొందరు మనుషులు ఆ తప్పుల ప్రాయిశ్చితంగా దేవుడిని ప్రార్థిస్తుంటారు. అటువంటిది.. మనుషులు చేసే తప్పుల్లో దేవుడికే పాత్ర ఉంటే..ఆ దేవుడు కూడా కోర్టు ముందు దోషిగా నిలబడితే ఇక దిక్కెవరు. ప్రభుత్వ భూమిని కబ్జాచేశారంటూ సాక్షాత్తు పరమశివుడికే కోర్టు సమన్లు జారీ చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్లోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. మార్చి 25న జరిగే విచారణకు హాజరు కావాలంటూ కోర్టు శివుడినే ఆదేశించింది కోర్టు. పూర్తి వివరాల్లోకి వెళితే..ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ జిల్లా 25వ వార్డు పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనదంటూ సుధా రజ్వాడే బిలాస్‌పుర్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కొందరు వ్యక్తులు అక్కడ ఆలయాన్ని నిర్మించారని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్లో శివాలయం సహా మరో 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు.

Also Read:Bank Fraud: చిరు వ్యాపారులను ముంచేసిన ముద్ర అగ్రికల్చర్ ప్రైవేట్ బ్యాంక్

దీనిపై విచారణ చేపట్టిన ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు..ఘటనపై దర్యాప్తు జరిపి, నిజానిజాలు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగంలోకి దిగిన ప్రభుత్వాధికారులు ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన 10 మందికి కోర్టు నోటీసులు ఇచ్చారు. భూకబ్జా వ్యవహారంలో మార్చి 25న కోర్టు విచారణకు హాజరు కావాలని లేని పక్షంలో ఆ భూమిని బలవంతంగా ఖాళీ చేయించి, రూ.10వేలు జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. అయితే ఈ నోటీసులు అందుకున్న పది మందిలో పరమశివుడు ఆరో వ్యక్తి కావడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. అయితే పిటిషన్లో మాత్రం శివాలయాన్ని నిందితుడిగా పేర్కొనగా..లెక్క ప్రకారం ఆలయాన్ని నిర్మించిన వారు లేదా ధర్మకర్తలు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

Also read:TS High Court : తెలంగాణ హైకోర్టుకు 10మంది కొత్త న్యాయమూర్తులు..నలుగురు మహిళలకు స్థానం