Home Isolation : హోం ఐసొలేషన్ కి కేంద్రం కొత్త గైడ్ లైన్స్

దేశంలోని కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్​లో ఉండేవారికి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త గైడ్ లైన్స్

Home Isolation : హోం ఐసొలేషన్ కి కేంద్రం కొత్త గైడ్ లైన్స్

Isolation

Home Isolation : దేశంలోని కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్​లో ఉండేవారికి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ కొత్త సూచనలు చేసింది.

కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం..హోం ఐసోలేషన్​లో ఉండే కొవిడ్ బాధితులు తప్పనిసరిగా ప్రత్యేక గదిలోనే ఉండాలి. ఇతరులతో ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. అన్ని వేళల్లో సర్జికల్​ మాస్కు ధరించటం తప్పనిసరి. 8 గంటల తర్వాత లేదా తడిగా మారితే తొలగించాలి. దానిని ఆల్కహాల్ ద్రావణంతో శుభ్రపరిచిన తర్వాతే పడేయాలి. తరచూ చేతులను 40 సెకన్లపాటు సబ్బుతో కడగాలి లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్​ వాడాలి. వ్యక్తిగత వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. గదిలో తరచూ తాకే వస్తువులు, ఉపరితలాలను ఒక శాతం హైపోక్లోరైట్​ ద్రావణంతో శుభ్రం చేస్తూ ఉండాలి. డాక్టర్ల సూచనలను పాటిస్తూ మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత, వ్యాధి లక్షణాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.

హోం ఐసోలేషన్​లో ఉండే కొవిడ్ బాధితులు రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టాలి. గోరు వెచ్చని నీటిని పుక్కిలించాలి. ఒకవేళ ట్యాబ్లెట్లకు జ్వరం తగ్గకుండా లక్షణాలు తీవ్రమవుతుంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. వైరస్ నిర్ధరణ అయ్యాక కనీసం 7రోజుల తర్వాత డిశ్చార్జ్​ అవ్వాలి. లేదా వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకపోయినా డిశ్చార్జ్ కావచ్చు. హోం ఐసోలేషన్ పూర్తయ్యాక మరోసారి కొవిడ్-19 టెస్ట్ అవసరం లేదు.

హోం ఐసోలేషన్​కు ఎవరు అర్హులు?
గృహ నిర్బంధంలో ఉండే వ్యక్తికి తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారి ధ్రువీకరించాలి. స్వీయ నిర్బంధంతో పాటు కుటుంబం క్వారంటైన్​లో ఉండేందుకు తగిన సదుపాయాలు ఉండాలి. స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు అండర్​ టేకింగ్ ఫారాన్ని సమర్పించాలి. 24 గంటలు సంరక్షకుడు అందుబాటులో ఉండాలి. సంరక్షకుడికి కొవిడ్​-19 వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తై ఉండాలి .60ఏళ్లు పైబడిన వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగస్థులు…. సంబంధిత మెడికల్ అధికారి సలహా మేరకే హోం ఐసోలేషన్​లో ఉండాలి. కరోనా బాధితుడు హోం ఐసోలేషన్​లో ఉన్నప్పుడు.. ఇంట్లోని మిగతా కుటుంబసభ్యులు హోం క్వారంటైన్ నిబంధనలను పాటించాలి.

ఇక,సంరక్షకుడు.. రోగితో ఉన్నప్పుడు మూడు పొరల మెడికల్ మాస్కు ధరించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. రోగి శరీర ద్రవాలను తాకవద్దు. రోగికి వారి గదిలోనే భోజన ఏర్పాట్లు చూడాలి. వారు వాడిన పాత్రలను గ్లౌజులు వేసుకుని సబ్బుతో శుభ్రంగా కడగాలి. పరిసరాలు శుభ్రం చేసేటప్పుడు, రోగికి దుస్తులు మార్చేటప్పుడు మాస్కుతో పాటు గ్లవ్స్​ కూడా ధరించాలి. వాటిని వేసుకునే ముందు, తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి.రోజువారీగా ఆరోగ్యం, శరీర ఉష్ణోగ్రతను సరిచూసుకోవాలి. ఏదైనా లక్షణాలు బయటపడితే వెంటనే వైద్య సాయం పొందాలి.

ALSO READ Corona Positive : ఇద్దరు డిప్యూటీ సీఎంలతో సహా నలుగురు మంత్రులకు కరోనా