Jio Lucky Lottery : అలాంటి కాల్స్‌తో… జియో యూజర్లు జాగ్రత్త.. లేదంటే జేబులు ఖాళీ

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త తరహాలో అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పుడు జియో కస్టమర్ల మీద పడ్డారు. జియో లక్కీ లాటరీ పేరుతో అమాయకులను దగా చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఓ విద్యార్థి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు. ఏకంగా రూ.5.94లక్షలు కోల్పోయాడు.

Jio Lucky Lottery : అలాంటి కాల్స్‌తో… జియో యూజర్లు జాగ్రత్త.. లేదంటే జేబులు ఖాళీ

Jio Lucky Lottery

Jio Lucky Lottery : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త తరహాలో అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పుడు జియో కస్టమర్ల మీద పడ్డారు. జియో లక్కీ లాటరీ పేరుతో అమాయకులను దగా చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఓ విద్యార్థి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు. ఏకంగా రూ.5.94లక్షలు కోల్పోయాడు.

సైబర్ నేరగాళ్లు బాధిత విద్యార్థికి ఫోన్ చేశారు. నీ జియో నెంబర్ కు రూ.25లక్షలు లాటరీ వచ్చిందన్నారు. ఆ మొత్తం తీసుకోవాలంటే ముందుగా పన్నులు చెల్లించాలని చెప్పారు. ఇది నమ్మేసిన విద్యార్థి వారి చెప్పినట్లుగా దశల వారిగా అమౌంట్ పంపాడు. అలా 5.94లక్షలు వారికి పంపాడు. అంత డబ్బు తీసుకున్నా వాళ్లు ఇంకా అడుగుతుండటంతో అతడికి అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మీకు ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.