ప్రజలకు సీఎం విజ్ఞప్తి : డబ్బుల్లేవ్ ప్లీజ్.. పార్టీకి సాయం చేయండి

  • Edited By: veegamteam , November 25, 2019 / 05:53 AM IST
ప్రజలకు సీఎం విజ్ఞప్తి : డబ్బుల్లేవ్ ప్లీజ్.. పార్టీకి సాయం చేయండి

ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.. ఈ సందర్భంగా ప్రజలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్నంగా  విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయటానికి నా దగ్గర అస్సలు డబ్బుల్లేవు… సీఎంగా ఉండగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఢిల్లీని డెవలప్ చేశాను.. కాబట్టి ప్రజలు తమ పాలనను అర్థం చేసుకుని మరోసారి ఓట్లు వేసి తమ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

ఉత్తర ఢిల్లీలోని బురాఢీలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేజ్రీవాల్ ప్రసంగించిన సందర్బంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతునివ్వాలని  ప్రజలను కోరారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ దగ్గర డబ్బులు లేవని.. గత ఐదేళ్లలో ఢిల్లీలో పలు అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ దగ్గర డబ్బులు లేవని తెలిపారు.

గడచిన ఐదేళ్లలో తాను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, తన కోసం ఎన్నికల్లో ప్రజలే పోరాడాలని కోరారు. ఢిల్లీలో అనుమతి లేని కాలనీలను క్రమబద్ధీకరించాలని అనుకున్నప్పటికీ బీజేపీ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడం లేదని కేజ్రీవార్ ఆరోపించారు.