వీడు డాక్టరేనా : ఆడపిల్ల పుట్టనుందని..అబార్షన్ చేయించుకోవాలని టార్చర్

వీడు డాక్టరేనా : ఆడపిల్ల పుట్టనుందని..అబార్షన్ చేయించుకోవాలని టార్చర్

Doctor forces wife to undergo abortion : వైద్య వృత్తిలో కొనసాగుతున్నాడు. ఇతరులకు చెప్పాల్సింది పోయి..నీచంగా ప్రవర్తిస్తున్నాడు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకుని..అబార్షన్ చేయించుకోవాలని భార్యను టార్చర్ పెడుతున్నాడు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని అతనికి ఏం తెలుసు ? లింగనిర్ధారణ పరీక్షలు చేయించడం నేరం కదా అని మీకు డౌట్ రావొచ్చు. అయితే..అతను డాక్టర్ కదా..పరిచయాలను ఉపయోగించి..లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకుని..భార్యపై తీవ్ర వత్తిడి తీసుకొస్తున్నాడు. దీంతో భార్య..పోలీసులకు కంప్లైట్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

యూపీలోని నోయిడాకు చెందిన ఓ మహిళకు మీరట్ కు చెందిన డాక్టర్ తో వివాహం జరిగింది. 2019లో పెళ్లి జరగగా..ప్రస్తుతం ఈమె గర్భవతి. తొలిసారి గర్భం దాల్చడంతో ఆమె ఎంతో సంతోషపడసాగింది. కానీ..ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండనీయడం లేదు ఆ భర్త. పుట్టబోయేది ఎవరో తెలుసుకోవాలని..తనకున్న పరిచయాలను ఉపయోగించి..లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. భార్య గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకున్నాడు. అబర్షాన్ చేయించుకోవాలని భార్యను టార్చర్ పెట్టసాగాడు. నరకం చూపిస్తుండడంతో భరించలేక..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది ఆ భార్య. అత్తింటి వారు వేధిస్తున్నారని తెలిపింది. అంతేగాకుండా..గతంలోనే ఆయనకు పెళ్లయ్యిందని, ఈ విషయం తెలియకుండా..తనను వివాహం చేసుకున్నాడని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా..పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.