Dosa On A Cycle: సైకిల్ దోశ.. 5నిమిషాల్లో అద్భుతమైన రుచితో..

కుదిరితే పరిగెత్తు.. లేకపోతే నడువు అని మహానుభావుడు చెప్పినట్లు కదలకుండా కూర్చోకుండా చేతిలో ఉన్న వనరులతోనే క్యాంటిన్ పెట్టేశాడో వ్యక్తి. ఈ రోజుల్లో మొబైల్ క్యాంటిన్ అంటే ఫోర్ వీలర్ ..

Dosa On A Cycle: సైకిల్ దోశ.. 5నిమిషాల్లో అద్భుతమైన రుచితో..

Dosa On Bycycle

Dosa On A Cycle: కుదిరితే పరిగెత్తు.. లేకపోతే నడువు అని మహానుభావుడు చెప్పినట్లు కదలకుండా కూర్చోకుండా చేతిలో ఉన్న వనరులతోనే క్యాంటిన్ పెట్టేశాడో వ్యక్తి. ఈ రోజుల్లో మొబైల్ క్యాంటిన్ అంటే ఫోర్ వీలర్ ఉండాల్సిందే. కానీ, ఇతను సైకిల్ మీద పెనం పెట్టుకుని దోసెలు వేస్తున్నాడు.

కస్టమర్ దగ్గరకు వెళ్లి అడిగిన వెంటనే దిగి దోసె రెడీగా ఇచ్చేస్తాడు. ఇదేదో కొత్త పని కాదు అతనికి పాతికేళ్లుగా అలవాటైన పనే. సైకిల్ పై డోర్ టూ డోర్ డెలివరీ చేస్తున్న ముంబైలోనే ఇది కూడా అమ్ముతున్నాడు. ముంబైలో దొరికే ఫాస్ట్ ఫుడ్ ను డామినేట్ చేస్తూ చట్నీలు, సాస్ లు కలిపి దోసె సర్వ్ చేస్తున్నాడు.

పైగా ఏ ఒక్క రకం దోసె వేసో ఊరుకోవడం లేదు. రూ.60 నుంచి రూ.100 మధ్య రేట్లలో ఉన్నాయి దోసె రకాలు. ఈ వ్యక్తి గురించి యూట్యూబ్ లో పోస్టు చేయడంతో పిచ్చిపిచ్చిగా వైరల్ అయిపోతుంది.

కోటి విద్యలు కూటి కొరకే అతను మనుగడ కోసం ఎంత కష్టపడుతున్నాడు. దేవుడు అతణ్ని చల్లగా చూడాలి అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. తనకు ఉన్న కొద్ది చోటులోనే శుభ్రంగా, చక్కగా అందిస్తున్నాడు.