Indira Gandhi: ఇందిరాగాంధీని బతికించేందుకు నాలుగు గంటలు శ్రమించాం.. ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పిన ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

ఇందిరా గాంధీ చనిపోయిన తరువాత ఆ విషయాన్ని రాజీవ్ గాంధీకి చెప్పాలని వెళ్లాను. కానీ, ఆ సమయంలో నాకు నోటివెంట మాటరాలేదు అంటూ డాక్టర్ పి. వేణుగోపాల్ తన రాసిన పుస్తకంలో వివరించారు.

Indira Gandhi: ఇందిరాగాంధీని బతికించేందుకు నాలుగు గంటలు శ్రమించాం.. ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పిన ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Indira Gandhi

Dr P Venugopal : భారతదేశంలో శక్తివంతమైన ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీకి పేరుంది. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో అనేక సంస్కరణలతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చేశారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన విషయం విధితమే. న్యూఢిల్లీలోని సప్దార్‌జంగ్ రోడ్డులోని తన నివాసంలో ఉదయం 9.10గంటల సమయంలో ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బందిలోని వ్యక్తులు కాల్చి చంపారు. ఆమె శరీరంలో 25 నుంచి 30 వరకు బులెట్లు దూసుకెళ్లాయి. వెంటనే ఆమెను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించామని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, అప్పటి కార్డియాలజీ విభాగాధిపతి పి. వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆయన రాసిన ‘హార్ట్ ఫెల్ట్’ పుస్తకంలో ఈ విషయాన్ని వివరించారు. గత వారం ఆ పుస్తకం విడుదలైంది. ఇందిరా గాంధీ రక్తపు మడుగులో ఆస్పత్రికి వచ్చిన తరువాత ఏం జరిగింది.. ఆమెను కాపాడేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం అనే విషయాలను ఆ పుస్తకంలో వేణుగోపాల్ వివరించారు.

AI Employees: ఏఐ దెబ్బకు ఉద్యోగాలు ఊడుతున్నాయ్..! 90శాతం మందిని పీకేసిన బెంగళూరు కంపెనీ

డాక్టర్ పి. వేణుగోపాల్ తన పుస్తకంలో రాసిన వివరాల ప్రకారం.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆస్పత్రి కొత్త డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అకస్మాత్తుగా ఇందిరాగాంధీని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె వస్తుంటే రక్తంతో తడిసిపోయిన ఆమె శరీరం నుంచి బుల్లెట్లు రాలిపడ్డాయి. రక్తం శరీరం నుంచి ధారగా కారుతుంది. ఆమె పొట్టలో నుంచి రక్తం పైకి ఎగిసిపడుతుంది. ఇందిరాగాంధీని కాపాడేందుకు తనతోపాటు మిగతా వైద్యులు, సర్జన్లు, నర్సింగ్ స్టాప్ ఎంతగానో శ్రమించారు. ఆమెకు ఓ నెగిటివ్ రక్తాన్ని ఎక్కించడానికి ఒకవైపు ప్రయత్నించామని, అప్పటికే ఆమె పరిస్థితి పూర్తిగా విషమంగా మారిందని వేణుగోపాల్ తెలిపారు. నేను కారిడార్లోకి వచ్చి పదవీ విరమణ చేయబోతున్న డైరెక్టర్ టాండన్, కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న స్నేహ్ భార్గవ్ వద్దకు వెళ్లాను. వారిద్దరూ నావైపు ఏం చేద్దామన్నట్లు చూస్తున్నారు. అప్పట్లో నేనే కార్డియాక్ సర్జరీ అధిపతిని. ఆ హోదాలో నేనే అత్యవసర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వేణుగోపాల్ చెప్పారు.

ముందుగా ఇందిర శరీరం నుంచి కారుతున్న రక్తాన్ని ఆపాలని నిర్ణయించా. అందుకోసం అధీకృత సంతకంకోసం కూడా నేను ఆగలేదు. ఇందిరా గాంధీని బైపాస్ యంత్రంపై ఉంచి బుల్లెట్లతో నిండిపోయిన ఆమె పొట్ట భాగంలో రక్తస్రావాన్ని ఆపాలనేది మా ప్రణాళిక. ఆ మేరకు నాలుగు గంటలు పనిచేశామని వేణుగోపాల్ తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు. మధ్యాహ్నం 2గంటల సమయంలో బైపాస్ చేయడానికి వైద్యులు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆమె పరిస్థితి పూర్తిగా విషమంగా మారడంతో ఆమెను కాపాడటం సాధ్యం కాలేదని వేణుగోపాల్ చెప్పారు.

18 Safe Cities : దేశంలోనే 18 సురక్షిత నగరాలున్న రాష్ట్రం…ఏదంటే…

ఇందిరాగాంధీకి ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్న సమయంలోనే.. ఆస్పత్రిలోకి పలువురు కీలక నేతలు వచ్చారు. అక్కడ వారు రాజకీయ చర్చలు జరుపుతున్నారు. తదుపరి ప్రధాని ఎవరు. ఎప్పుడు ప్రమాణం చేయాలనే చర్చ అక్కడ సాగిందని వేణుగోపాల్ తాను రాసిన పుస్తకంలో వెల్లడించారు. అయితే, ఇందిరాగాంధీని ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ఇందిరా గాంధీ చనిపోయిన తరువాత ఆ విషయాన్ని రాజీవ్ గాంధీకి చెప్పాలని వెళ్లాను. కానీ, ఆ సమయంలో నాకు నోటివెంట మాటరాలేదు అంటూ వేణుగోపాల్ పుస్తకంలో వివరించారు.

Amit shah: అమిత్ షా ఖమ్మం టూర్ ఖరారు.. భారీ బహిరంగ సభ నిర్వహణకు తెలంగాణ బీజేపీ కసరత్తు

దేశంలో 50వేల గుండె శస్త్రచికిత్సలు చేసిన ఘనత డాక్టర్ వేణుగోపాల్ కు ఉంది. ఇందిరాగాంధీకి మొదటి బుల్లెట్ తాకిన వెంటనే ఆమె కిందపడిపోయారు. ఆమె పక్కన ఉన్నవారు ఆమెను ఒంటరిగా వదిలేశారు. దీంతో హంతకుడు మరింత దగ్గరకు వచ్చి ఆమె శరంలోకి దాదాపు 25 నుంచి 30 తూటాలను దించాడు. అయితే, మొదటి రౌండ్ కాల్పుల్లో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే ఆమెను కాపాడగలిగేవారమని వేణుగోపాల్ తన పుస్తకంలో రాశారు. వేణుగోపాల్ రాసిన ‘హార్ట్ ఫెల్ట్.. ఏ కార్డియాక్ సర్జన్స్ పయనీరింగ్ జర్నీ’ పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ ఇండియా సంస్థ ప్రచురించింది.