Bihar : భర్త ముఖం చూసి .. కడుపులో బిడ్డతో సహా చనిపోయిన 8 నెలల గర్భిణి

ఎనిమిది నెలల గర్భిణి భర్త మొహం చూసి కన్నుమూసిన విషాద ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్లముందే చనిపోవటం..పుట్టకుండానే బిడ్డను పోగొట్టుకున్న ఆ భర్త..

Bihar :  భర్త ముఖం చూసి .. కడుపులో బిడ్డతో సహా చనిపోయిన 8 నెలల గర్భిణి

pregnant pass away seeing husbands face

pregnant die after seeing her husbands face : బీహార్ లోని సెంట్రల్ జైలులో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణి జైలులో ఉన్న తన భర్తను చూడటానికి వచ్చింది. భర్తను కళ్లారా చూసుకుంది. ఆ తరువాత వెంటనే స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. మరో 20 రోజుల్లో తల్లి కావాల్సిన ఆమె అనూహ్యంగా చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.

 

భాగల్ పూర్ కు చెందిన ఘోఘా గోవింద్ పూర్ కు చెందిన గుడ్డు యాదవ్ పల్లవి అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం జరిగి రెండేళ్లు అయ్యింది. ప్రస్తుతం పల్లవి ఎనిమిది నెలల గర్భిణి. జూన్ 27(2023)న పల్లవికి ప్రసవం డేటు కూడా ఇచ్చారు డాక్టర్లు. గుడ్డు యాదవ్‌కు వినోద్‌ యాదవ్‌ అనే వ్యక్తితో భూమి విషయంలో వివాదం ఉంది. ఈ వివాదం కాస్తా గొడవకు దారి తీసింది. దీంతో గుడ్డు యాదవ్ పై వినోద్ యాదవ్ కేసు పెట్టాడు. దీంతో గుడ్డు యాదవ్ పై సెక్షన్ 307 ప్రకారంగా కేసు నమోదుకావటం..భాగల్పూర్ ప్రత్యేక సెంట్రల్ జైలుకు తరలించారు. అలా గుడ్డు యాదవ్ తో అతనికి రిమాండ్ విధించారు. దీంతో అతను ఎనిమిది నెలలుగా అక్కడే శిక్ష అనుభవిస్తున్నాడు.

 

ఈక్రమంలో మంగళవారం (జూన్ 6)న పల్లవి తన భర్త కలిసేందుకు జైలుకు వెళ్లింది. గుడ్డు నెంబర్ రాగానే ఆతృతగా భర్తను చూసుకుంది. తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యింది.అంతే భర్త ఎదురుగానే పల్లవి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడున్న పోలీసులు మాయాగంజ్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పల్లవి చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. పల్లవి మరణంతో పాటు కడుపులో శిశువు కూడా చనిపోయిందని డాక్టర్లు తెలిపారు.

కానీ పోలీసుల వల్లే పల్లవి ప్రాణాలు కోల్పోయిందని గుడ్డు సోదరుడు విక్కీ యాదవ్ ఆరోపించాడు. వినోద్ యాదవ్ నుంచి డబ్బులు తీసుకుని పోలీసులు నా అన్నను జైలుపాలు చేశారని..నా వదిన ప్రాణాలు పోవటానికి కూడా కారణం పోలీసులేనంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. పల్లవి మృతి తర్వాత పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కానీ చేయాల్సిన రూల్ ఉందని చేయాలని పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను..పుట్టకుండానే బిడ్డను పోగొట్టుకున్న గుడ్డు యాదవ్ కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. పల్లవి అంత్యక్రియల కోసం పోలీసు రక్షణలో శ్మశానవాటికకు చేరుకున్నాడు గుడ్డు యాదవ్. భార్యకు అంత్యక్రియలు నిర్వహించాడు.