Omicron Case : 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్

ఎనిమిదేళ్ల బాలుడికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్దారణ అయింది. కుటుంబంతో కలిసి ఈ నెల 17న యూకే నుంచి ఇండియాకు వచ్చాడు బాలుడు. వైద్యపరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది.

Omicron Case : 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్

Omicron Case

Omicron Case : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 135 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచంలో 100కు పైగా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యూకే, యూఎస్‌లో ఒమిక్రాన్‌ ప్రభావం అధికంగా ఉంది. ఇక తాజాగా గోవాలో 8ఏళ్ల బాలుడికి ఓమిక్రాన్ వేరియంట్ నిర్దారణ అయింది. డిసెంబర్ 17న బాలుడు యూకే నుంచి వచ్చాడు. అయితే యూకే ఎయిర్ పోర్టులో నిర్వహించిన టెస్టుల్లో అతడికి నెగటివ్ నిర్దారణ అయింది. దీంతో కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చాడు. విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్యాధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

చదవండి : Omicron: చాపకింద నీరులా ఒమిక్రాన్‌.. భారత్‌లో ఒకేరోజు భారీగా పెరిగిన కేసులు

ఈ నేపథ్యంలోనే బాలుడికి.. అతడి కుటుంబ సభ్యులకి పరీక్షలు నిర్వహించారు అధికారులు. దీంతో బాలుడికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ పంపారు. ఈ పరీక్షలో బాలుడికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆ బాలుడి ప్రైమరీ కాంటాక్ట్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గోవాలో ఇదే మొదటి ఒమిక్రాన్‌ కేసు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య సిబ్బందిని అలెర్ట్ చేసింది.

చదవండి : Omicron In America : అమెరికాను వణికిస్తున్న ఒమిక్రాన్.. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే..!