Eknath Shinde: ఉత్కంఠ వీడింది.. మంత్రివర్గ విస్తరణకు సీఎం గ్రీన్ సిగ్నల్

బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునగంటీవార్, గిరిష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్, రాధాకృష్ణ వీకే పాటిల్, రవి చవాన్, బబనరావ్ లోణికార్, నితేష్ రాణెలకు చోటు దక్కుతుండగా.. షిండే వర్గం నుంచి దాదా భూసే, దీపక్ కేసర్‭కర్, శంభూ రాజె దేశాయ్, సందీపన్ భుమ్రే, సంజయ్ శిర్‭సాఠో, అబ్దుల్ సత్తారి, బచ్చూ కడూ(లేదంటే రవి రాణా)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాజ్‭భవన్‭లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వీరి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Eknath Shinde: ఉత్కంఠ వీడింది.. మంత్రివర్గ విస్తరణకు సీఎం గ్రీన్ సిగ్నల్

Eknath Shinde:: ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. శుక్రవారం(ఆగస్టు 5) రోజున నూతనంగా 15 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే గురువారం ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులకు పైగా గడిచిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తుండడం విశేషం. నూతనంగా ఏర్పడే మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎనిమిది మంది, షిండే వర్గం నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసలు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నలు, విమర్శలు షిండే ప్రభుత్వాన్ని కొద్ది రోజులుగా వెంటాడుతున్నాయి. ఈ విషయమై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చే జరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెర దించాలని షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మంత్రివర్గ విస్తరణకు పూనుకుంది.

బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునగంటీవార్, గిరిష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్, రాధాకృష్ణ వీకే పాటిల్, రవి చవాన్, బబనరావ్ లోణికార్, నితేష్ రాణెలకు చోటు దక్కుతుండగా.. షిండే వర్గం నుంచి దాదా భూసే, దీపక్ కేసర్‭కర్, శంభూ రాజె దేశాయ్, సందీపన్ భుమ్రే, సంజయ్ శిర్‭సాఠో, అబ్దుల్ సత్తారి, బచ్చూ కడూ(లేదంటే రవి రాణా)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాజ్‭భవన్‭లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వీరి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ-రెబల్ శివసేన కలయికలో జూలై 30న నూతన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఏక్‭నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 30న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తైనప్పటికీ మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మీడియా ప్రతినిధులు, ఇతరులు మంత్రివర్గ విస్తరణ గురించి ప్రశ్నించిన ప్రతీసారి తొందర్లోనే ఏర్పాటు చేస్తామంటూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా నాన్చుతూ వచ్చారు. ఈ విషయమై విపక్షాలు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలె కొద్ది రోజుల క్రితం మహా ప్రభుత్వాన్ని ‘ఏక్ దుజే కే లియే’(అన్యోన్యమైన జంట) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అరెరె.. నేను అంతలా ఆలోచించలేదే: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై సుప్రియ సెటైర్లు