అరెరె.. నేను అంతలా ఆలోచించలేదే: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై సుప్రియ సెటైర్లు

మహా ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పార్లమెంట్ వేదికగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే సెటైర్లు వేశారు. మహా ప్రభుత్వం ‘ఏక్ దుజే కే లియే’(అన్యోన్యమైన జంట) అని బీజేపీకి చెందిన ఒక ఎంపీ వ్యాఖ్యానించారని అయితే తాను అంతలా ఆలోచించలేకపోయానని సుప్రియా అన్నారు.

అరెరె.. నేను అంతలా ఆలోచించలేదే: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై సుప్రియ సెటైర్లు

Ek Duje Ke Liye: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీసీ కలయికలోని మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ-శివసేన(రెబెల్) నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్నప్పటికీ కెబినెట్ విస్తరణ మాత్రం జరగడం లేదు. ఇప్పటికి మహా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమే ఉన్నారు. కాగా, మహా ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పార్లమెంట్ వేదికగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే సెటైర్లు వేశారు. మహా ప్రభుత్వం ‘ఏక్ దుజే కే లియే’(అన్యోన్యమైన జంట) అని బీజేపీకి చెందిన ఒక ఎంపీ వ్యాఖ్యానించారని అయితే తాను అంతలా ఆలోచించలేకపోయానని సుప్రియా అన్నారు.

‘‘బీజేపీకి చెందిన ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలను నేను ఇప్పుడు గుర్తు చేసుకోవాలని అనుకుంటున్నాను. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అన్యోన్యమైన జంట అన్నారు. అయితే ఇలాంటి పోలీకను నేను అస్సలు ఊహించలేకపోయాను. నిజంగానే మహా ప్రభుత్వంలో ఒక జంట మాత్రమే ఉంది. రాష్ట్రంలో రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. వర్షాల వల్ల రైతులు, ప్రజలకు అనేక అవస్తలు ఎదురవుతున్నాయి. కానీ ప్రభుత్వంలో పని చేసేవారు లేరు. ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారికి వారి స్థానాల్ని కాపాడుకోవడానికే సమయం సరిపోవడం లేదు. ఇక ప్రజల బాగోగుల ఏం చూస్తారు?’’ అని బుధవారం పార్లమెంట్‭లో చర్చ సందర్భంగా సుప్రియ అన్నారు.

Jantar Mantar: ధర్నాకు దిగిన మోదీ సోదరుడు

ఇంకా ఆమె మాట్లాడుతూ గత(మహా వికాస్ అగాఢీ) ప్రభుత్వంలో ఒక నిర్దిష్టమైన వ్యవస్థ ఉండేదని, ప్రతి జిల్లాకు ఒక సంరక్షణ మంత్రి ఉండేవారని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఆ మంత్రి పని చేసేవారని అన్నారు. స్థానికులు నేరుగానో ఫోన్ ద్వారానో సమాచారం ఇచ్చిన వెంటనే సమస్యలు పరిష్కారానికి వచ్చేవని గర్తు చేశారు. అయితే ఇప్పటి ప్రభుత్వంలో ప్రజల కష్టాలను చూసేందుకు ఎవరూ లేరని, తీర్చేందుకు ఇక మొత్తానికే లేరని అన్నారు. మంత్రులు లేక అధికారులకు ఏం చేయాలో తోచడం లేదని, ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదరుచూడడమే కానీ, ఇప్పటికీ ఎలాంటి ఆదేశాలు రాక వారు విసుగెత్తిపోతున్నారని సుప్రియ అన్నారు.

మహారాష్ట్రలో షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం జూన్ 30న ఏర్పడింది. శివసేన నుంచి భారీ స్థాయిలో ఎమ్మెల్యేల్ని బయటకు లాగి మహా వికాస్ అగాఢీ ప్రభుత్వాన్ని పడగొట్టిన అనంతరం ఈ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ప్రభుత్వం ఏర్పడి నెలకు పైగా అవుతున్నా కెబినెట్ విస్తరణ ప్రస్తావనే లేదు. మీడియా నుంచి ప్రశ్నలు ఎదురైన ప్రతీసారి తొందర్లోనే విస్తరిస్తాం అంటూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు చెబుతూ వస్తున్నారు.

Mahua Moitra: అధిక ధరలపై చర్చ జరుగుతుండగా ఖరీదైన బ్యాగ్‭ను కనిపించకుండా దాచిన ఎంపీ!