Election Commission: 253 పార్టీల గుర్తింపు రద్దు.. కారణం ఏంటంటే..?

కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఈసీ ఆరోపించింది. ఏదైనా రాజకీయ సంస్థగా నమోదు చేసుకున్న సంస్థకు పోస్టల్ అడ్రస్ తప్పనిసరి. అందులో మార్పులు ఉంటే తప్పనిసరిగా ఈసీకి తెలియజేయాలి

Election Commission: 253 పార్టీల గుర్తింపు రద్దు.. కారణం ఏంటంటే..?

Election Commission delists 86 parties and declares 253 inactive

Election Commission: పేరుకే తప్ప ఎక్కడా కానరాని రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కన్నెర్ర చేసింది. ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో పాటు కనీసం క్రియాశీలకంగానూ వ్యవహరించని ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 253 పార్టీల గుర్తింపు రద్దైంది. ఇకపై ఆయా పార్టీలను ఇక నుంచి ఈసీ గుర్తింపులేని పార్టీలుగానే పరిగణిస్తారు. అయితే ఈ నిర్ణయంపై ఏవేని అభ్యంతరాలుంటే తగిన సాక్ష్యాలతో తమను సంప్రదిస్తే పరిశీలిస్తామని ఈసీ ప్రకటించింది.

ఎలక్షన్ కమిషన్ దగ్గర కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిష్టర్ అయ్యాయి. అందులో చాలా పార్టీలు ఇప్పుడు యాక్టివ్‌గా లేవు. ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షాళన మొదలుపెట్టింది. క్రియాశీలకంగా లేని పార్టీలపై వేటు వేస్తోంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపు, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.

ఇక మనుగడలోలేని మరో 86 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. ఢిల్లీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 253 యాక్టివ్‌గా లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014-19 ఎన్నికల్లో పోటీచేయని రాజకీయపార్టీలను సయితం యాక్టివ్‌గా లేని పార్టీలుగా గుర్తించారు.

కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఈసీ ఆరోపించింది. ఏదైనా రాజకీయ సంస్థగా నమోదు చేసుకున్న సంస్థకు పోస్టల్ అడ్రస్ తప్పనిసరి. అందులో మార్పులు ఉంటే తప్పనిసరిగా ఈసీకి తెలియజేయాలి. అయితే చాలా రాజకీయ పార్టీలు ఈ విధానాలను పాటించడంలేదని ఈసీ గుర్తించింది. అందుకే ఆయా పార్టీలను రద్దు చేసినట్లుగా ఈసీ ప్రకటించింది.

Bihar Big Twist: నితీశ్ కుమార్‭తో ప్రశాంత్ కిశోర్ భేటి.. ఒకటయ్యారా, కాబోతున్నారా?