India మొత్తంలో 93మంది డాక్టర్లను పొట్టన బెట్టుకున్న కరోనా

India మొత్తంలో 93మంది డాక్టర్లను పొట్టన బెట్టుకున్న కరోనా

మూడు నెలలుగా శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులకు ట్రీట్‌మెంట్ అందించే క్రమంలో 93మంది డాక్టర్లు చనిపోయారు. పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తూ 12వందల మందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్తుంది. IMA ప్రెసిడెంట్ డా. రంజన్ శర్మ జులై 18వరకూ నమోదైన డేటా ప్రకారం.. ఇది అఫీషియల్ అని చెప్పారు.

ఇవాల్టి వరకూ నమోదైన డేటా ప్రకారం.. 1279కి వైరస్ సోకగా 93మంది డాక్టర్లు Covid-19తో చనిపోయారని రంజన్ శర్మ చెప్పారు. ఈ వివరాలను సునిశితంగా విశ్లేషించి చెప్పిన రంజన్..

771 మంది 35ఏళ్లు కంటే తక్కువ వయస్సున్న వారు
247మంది 35నుంచి 50ఏళ్ల మధ్య వయస్సు వారు
261మంది 50ఏళ్లు కంటే పైబడ్డ వారే.

ఐఎమ్ఏ డేటా రిలీజ్ చేయడానికి ఎప్పుడూ రెడీగా లేదు. కొవిడ్-19 ప్రభావంతో మా డాక్టర్ చనిపోయిన రోజు నుంచి నేషనల్ కొవిడ్ రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. స్టార్టింగ్ లో ఇది అంత ఇంపార్టెంట్ అనిపించకపోయినా క్రమంగా సీరియస్ గా తీసుకున్నాం. డా.శర్మ మాట్లాడుతూ.. ఐఎమ్ఏ ప్రస్తుతం ఇలాంటి డేటానే కలెక్ట్ చేస్తుందని.. కొవిడ్ 19 కారణంగా ఎఫెక్ట్ అయిన వారి గురించి పూర్తి అలర్ట్ తో ఉంటున్నామని అన్నారు.

పలు కారణాల రీత్యా నష్టపోయిన వారి గురించి రీసెర్చ్ డాక్యుమెంట్ పై పనిచేస్తున్నాం. ఎంతమంది డాక్టర్లు జనరల్ ప్రాక్టీస్ లో భాగంగా ప్రాణాలు కోల్పోయారో చూస్తున్నాం. త్వరలోనే ఐఎమ్ఏ దీని వెనుక కారణాలతో సహా వెల్లడిస్తుంది. ఏమీ దాచడం లేదు. ఇది మా అఫీషియల్ డేటా అని శర్మ అన్నారు.