Tcil : టిసిఐఎల్ లో అప్రంటీస్ ఖాళీల భర్తీ

ఇప్పటికే వివిధ సంస్థల్లో అప్రంటీస్ గా పని చేస్తున్న వారు ఈ ఖాళీలకు అప్లై చేయడానికి అనర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.

Tcil : టిసిఐఎల్ లో అప్రంటీస్ ఖాళీల భర్తీ

Tcil

Tcil : టెలీ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ TCIL అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రైనీ ఇంజనీర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.. దరఖాస్తుకు నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలి. మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ లో ఫుల్ టైం బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్) చేసిన వారు 4 ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రతీ నెల స్టైఫండ్ గా రూ. 9 వేలు చెల్లించనున్నారు. ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్ లో బీఈ, బీటెక్ చేసిన వారి కోసం 2 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేల పాటు స్టైఫండ్ చెల్లించనున్నారు.

ఇప్పటికే వివిధ సంస్థల్లో అప్రంటీస్ గా పని చేస్తున్న వారు ఈ ఖాళీలకు అప్లై చేయడానికి అనర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేషనల్ అప్రంటీస్ ట్రైనింగ్ స్కీం పోర్టల్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం నాట్స్ పోర్టల్ లో అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి. ఆ అప్లికేషన్ ఫామ్ స్కానింగ్ కాపీని tcilapprentice2021@gmail.com మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది.