Maharashtra: రైల్వే స్టేషన్‌లో కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. 20 మందికి గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం

మహారాష్ట్రలోని ఒక రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ప్రయాణికులు బ్రిడ్జి పై నుంచి కింద ఉన్న రైలు పట్టాలపై పడిపోయారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Maharashtra: రైల్వే స్టేషన్‌లో కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. 20 మందికి గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం

Maharashtra: ఇటీవలి గుజరాత్, మోర్బి ఘటన మరువక ముందే మహారాష్ట్రలో మరో బ్రిడ్జి కూలిపోయింది. మహారాష్ట్ర, చంద్రాపూర్ పరిధిలోని, బల్హార్షా రైల్వే స్టేషన్‌లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 20 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం.

Honey Trapping: హనీ ట్రాపింగ్‌కు పాల్పడ్డ యూట్యూబ్ కపుల్.. వ్యాపారిని బెదిరించి రూ.80 లక్షలు వసూలు

వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రైల్వే ప్రయాణికులు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి నాలుగో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు ఈ బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా ఉన్నట్లుండి కూలిపోయింది. దీంతో ప్రయాణికులు కింద ఉన్న రైలు పట్టాలపై పడిపోయారు. ఈ బ్రిడ్జి దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉంది. అంత ఎత్తు నుంచి పడటంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.