Mysuru : చిన్నారి ప్రాణం తీసిన రూ.5 కాయిన్

చిన్నారి చేతిలో ఐదు రూపాయల కాయిన్ ఉంది. ఆడుకుంటూ...ఆ కాయిన్ ను నోట్లో పెట్టుకుంది. అది కాస్తా..గొంతులో ఇరుక్కపోయింది.

Mysuru : చిన్నారి ప్రాణం తీసిన రూ.5 కాయిన్

Five Rs Coin

Five Rupees Coin : చిన్న పిల్లలు ఆడుకొనే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆడుకొనే వస్తువులు మాత్రమే పెట్టాలని..వారిని గమనిస్తూ..ఉండాలని పెద్దలు, ఇతరులు చెబుతున్నా..కొంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహిస్తుంటారు. దీని కారణంగా…వారు ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిపాటి నిర్లక్ష్యం వారింట్లో విషాదాన్ని నింపుతోంది. కొంతమంది చిన్నారులు ఆడుకుంటూ…కొన్ని వస్తువులు నోట్లో పెట్టుకుంటుంటారు. అవి కాస్తా..గొంతులో ఇరుక్కపోవడంతో..ఊపిరిఆడక పోవడంతో ఆ చిన్నారులకు అప్పుడే నిండు నూరేళ్లు నిండుతున్నాయి. తాజాగా..మైసూరులో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

Read More : KBC: కోటి గెలిచిన అంధురాలి కథ.. విధిని జయించిన స్ఫూర్తి గాథ!

మైసూరు జిల్లా హణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామంలో ఖుషీ (4) తల్లిదండ్రులతో ఉంటోంది. ఇంటి ఎదుట ఆడుకొంటూ ఉంది. ఆ సమయంలో..ఆమె చేతిలో ఐదు రూపాయల కాయిన్ ఉంది. ఆడుకుంటూ…ఆ కాయిన్ ను నోట్లో పెట్టుకుంది. అది కాస్తా..గొంతులో ఇరుక్కపోయింది.

Read More :Red Alert : నాన్ స్టాప్ వర్షాలు, ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్

దీంతో ఆ చిన్నారి ఊపరి ఆడక విలవిల్లాడి పోయింది. దీనిని గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చిన్నారి గొంతును స్కాన్ చేయగా..రూ. 5 కాయిన్ కనబడింది. ఆమె ప్రాణాన్ని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నాలాలు విఫలమయ్యాయి. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. అప్పటి వరకు తమ కళ్లెదుటే…ఆడుకున్న చిన్నారి..విగతజీవిగా మారడంతో…కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.