Credit Card : జాబ్ లేకున్నా క్రెడిట్ కార్డు.. ఇలా పొందొచ్చు..

సాధారణంగా జాబ్ చేసే వారికి క్రెడిట్ కార్డు పొందడం పెద్ద కష్టం కాదు. వారి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు మంజూరు చేస్తాయి. దీని కోసం శాలరీ స్లిప్..

Credit Card : జాబ్ లేకున్నా క్రెడిట్ కార్డు.. ఇలా పొందొచ్చు..

Credit Card

Credit Card : సాధారణంగా జాబ్ చేసే వారికి క్రెడిట్ కార్డు పొందడం పెద్ద కష్టం కాదు. వారి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు మంజూరు చేస్తాయి. దీని కోసం శాలరీ స్లిప్, ఆదాయపు పన్ను రిటర్న్(ఐటిఆర్) సమర్పిస్తే సరిపోతుంది. ఉద్యోగం చేసే వారికి నో ప్రాబ్లమ్. మరి జాబ్ లేని వారి పరిస్థితి ఏంటి? విద్యార్థులు, రిటైర్డ్ వ్యక్తులు, గృహిణిల మాటేమిటి? అలాంటి వారికి క్రెడిట్ కార్డు కావాలంటే ఏం చేయాలి? అసలు అలాంటి వారికి క్రెడిట్ కార్డులు ఇస్తారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అలాంటి వారు క్రెడిట్ కార్డు లేకపోతే కొత్త కార్డు తీసుకోవచ్చని మీకు తెలుసా? స్వయం ఉపాధి/నిరుద్యోగులు క్రెడిట్ కార్డు పొందడం అనేది కష్టంగా కావచ్చు కానీ అసాధ్యం కాదు. మీకు ఉద్యోగం లేకున్నా క్రెడిట్ కార్డును ఎలా పొందగలరో ఇప్పుడు తెలుసుకుందాం..

Debit Cards : నో నెట్‌వర్క్.. ఆఫ్‌లైన్‌లోనూ డెబిట్ కార్డులు వాడొచ్చు!

స్టాండర్డ్ క్రెడిట్ కార్డు:
మీరు నిరుద్యోగి అయితే మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, ప్రొఫెషనల్ ఫీజులు మొదలైన ఇతర వనరుల నుంచి మీ బ్యాంకు ఖాతాలో ప్రతి నెల స్థిరమైన ఆదాయం వస్తుంటే బ్యాంకులు, కార్డు కంపెనీలు అవసరమైన పత్రాలను ధృవీకరించిన తర్వాత క్రెడిట్ కార్డును జారీ చేసే అవకాశం ఉంది. రుణదాతలు ఎల్లప్పుడూ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లు చెక్ చేస్తాయి. అంటే, క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించే సామర్ధ్యం దరఖాస్తుదారుడికి ఉందా? లేదా? అనేది తనిఖీ చేస్తాయి.

How to Pick the Best Credit Card for You

యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు:
ఒకవేళ ఎటువంటి ఆదాయవనరు లేకపోయినా, నిరుద్యోగి అయినా వారు కూడా క్రెడిట్ కార్డు పొందే మార్గం ఉంది. కుటుంబంలో ఎవరైనా ఇప్పటికే ఒక క్రెడిట్ కార్డును కలిగి ఉన్నట్లయితే మీరు యాడ్ ఆన్ లేదా సప్లిమెంటరీ క్రెడిట్ కార్డును పొందవచ్చు. ఇది ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులకు ఉపయోగకరంగా ఉంటుంది. యాడ్ ఆన్ కార్డు అనేది ప్రాథమిక క్రెడిట్ కార్డు(ప్రామాణిక లేదా సురక్షితమైన క్రెడిట్ కార్డు) కింద జారీ చేసిన మరో అదనపు కార్డు.

Remove Apps : వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

సాధారణంగా ప్రాథమిక కార్డుహోల్డర్ తన జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇది ఇవ్వవచ్చు. ఈ సందర్భంలో మొత్తం క్రెడిట్ లిమిట్ అనేది ప్రైమరీ. యాడ్ ఆన్ కార్డ్ హోల్డర్ మధ్య పంచుతారు. రెండు కార్డులను ఉపయోగించి చేసిన అన్ని లావాదేవీలకు ఒకే కన్సాలిడేటెడ్ స్టేట్ మెంట్ ఇస్తారు.

Credit Cards: All You Need to Know

సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్:
మీకు జాబ్ లేకపోయినా, హామీదారుడు లేకున్నా మీరు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును పొందొచ్చు. దీని కోసం మీరు నిర్దిష్ట మొత్తంను బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డును తిరిగి చెల్లించలేకపోతే, మీ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి ఆ సొమ్ము రికవరీ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ అనేది సాధారణంగా డిపాజిట్ మొత్తంలో 80-90 శాతం వరకు ఉంటుంది.