చెత్త ఏస్కో  టీ పట్టుకో : కుంభమేళాలో వెరైటీ మిషన్

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 09:42 AM IST
చెత్త ఏస్కో  టీ పట్టుకో : కుంభమేళాలో వెరైటీ మిషన్

అలహాబాద్ : వ్యర్థ పదార్ధాలను వినియోగించుకుంటే పర్యావరణాన్ని పరిరక్షించటమేకాక..వన అవసరాలు కూడా తీరే విధంగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా…వినూత్న ఆలోచన. చిన్నపాటి శ్రద్ధ. మనుష్యులు ఎక్కడుంటే అక్క చెత్త పేరుకుపోవటం సాధారణ విషయం. అలా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జరుగుతున్న కుంభమేళా సందర్భంగా నేల ఈనిందా అన్నట్లుగా జనసందోహం కొనసాగుతోంది. ఈ కుంభమేళాలో ఓ మెషీన్ అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే టీ వెండింగ్ మెషీన్. 
 

కుంభమేళాకు కోట్లాదిమంది భక్త సందోహం వస్తుండడంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు..గంగా స్నానాలకు వచ్చిన భక్తులు చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఉండేందుకు ప్రభుత్వం  యూపీ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేసింది. దీంట్లో భాగంగా చెత్త సేకరణ కోసం అధికారులు ఓ మెషీన్‌ను ఏర్పాటు చేశారు. దానికి మరోక వినూత్న ఆలోచన చేసింది ప్రభుత్వం. సాధారణంగా చెత్త డబ్బా అక్కడ పెట్టి చెత్త వేయమంటే వేసేందుకు అందరూ ముందుకు రారు కానీ.. అలా చెత్త వేసిన ప్రతిసారి వేడివేడిగా ఓ చాయ్ ఇస్తే..ఎలా ఉంటుంది. డిఫరెంట్ కదూ.. వావ్! భలేగా ఉంది ఐడియా అంటాం కదూ…ఇదిగో ఈ కుంభమేళాలో అదే జరుగుతోంది. ఇక్కడి  భక్తులతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త మెషీన్ లోనే చెత్తను వేసేస్తున్నారు..దాంతో పాటు వేడి వేడి ఛాయ్ లతో ఎంజాయ్ చేస్తున్నారు.  

 
పరిశుభ్రత, పర్యావరణం పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ టీ వెండింగ్ మెషీన్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. భక్తులు తాము వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్తా చెదారాన్ని ఆ వెండింగ్ మెషీన్‌లో వేసేస్తున్నారు. అసలే యూపీలో చలి చంపేస్తోంది. ఈ మెషీన్ పుణ్యమా అంటు  చంపేస్తున్న చలిలో వెచ్చని చాయ్ తాగి వెళ్తున్నారు. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ద్వారా పనిచేసే ఈ మెషీన్ చెత్తను వేయడానికి ఉద్దేశించిన బాక్స్‌లో చెత్తను పూర్తిగా వదిలిపెట్టిన తర్వాత మాత్రమే టీ ఇస్తోంది.
ఉత్తరప్రదేశ్, కుంభమేళా, టీ వెండింగ్ మెషీన్, హాట్ ఛాయ్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్,