Kejriwal: ‘ఓటు వేసిన చోటే వ్యాక్సిన్ వేయించుకోండి’

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ కొవిడ్-19 మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు వేసిన చోటే వ్యాక్సిన్ వేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. ఇవాల్టి (సోమవారం జూన్ 7) నుంచి ఓటు ఎక్కడైతే వ్యాక్సిన్ అక్కడే ప్రచారం...

Kejriwal: ‘ఓటు వేసిన చోటే వ్యాక్సిన్ వేయించుకోండి’

Get Vaccinated Where You Vote Kejriwal

Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ కొవిడ్-19 మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు వేసిన చోటే వ్యాక్సిన్ వేసుకోవచ్చని ప్రజలకు సూచించారు.

ఇవాల్టి (సోమవారం జూన్ 7) నుంచి ఓటు ఎక్కడైతే వ్యాక్సిన్ అక్కడే ప్రచారం మొదలుపెట్టామని ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లి వ్యాక్సినేషన్ చేయించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ కూడా ఉంటుందని ప్రెస్ కాన్ఫిరెన్స్ వేదికగా ప్రకటించారు.

వచ్చే 4వారాల్లో 45ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న వాళ్లందరికీ వ్యాక్సిన్ అందేలా ప్లాన్ చేస్తున్నామని ఢిల్లీ సీఎం అన్నారు.

ఢిల్లీలో కరోనా కేసుల నమోదు తగ్గడంతో అన్‌లాక్ ప్రక్రియ షురూ అయింది. రోజుకు 40వేలకు పైగా నమోదైన స్థాయి నుంచి 400 కంటే తక్కువ కేసులతో కొనసాగుతూ ఉంది దేశ రాజధాని. ఈ మేరకు నిబంధనలు సడలించే పనిలో పడింది. దుకాణాలు, మాల్స్, మార్కెట్ కాంప్లెక్సులు ఓపెన్ చేయాలని నిర్ణయించారు.

ప్రత్యామ్నాయ పద్ధతిలో ఓపెన్ చేయాలని సరి, బేసి విధానాలను అమల్లోకి తీసుకొచ్చారు.