Pakistan: డ్రగ్స్ తీసుకోనందుకు విద్యార్థినిపై తీవ్ర దాడికి దిగిన తోటి విద్యార్థినిలు

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యుడు మహీన్ ఫైసల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రౌడీ అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మద్యం తాగడానికి నిరాకరించినందుకు బాలికపై సహవిద్యార్థులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన దుండగుల కంపెనీలో చేరేందుకు నిరాకరించినందుకే తన కుమార్తెను కొట్టారని బాధిత బాలిక తండ్రి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు.

Pakistan: డ్రగ్స్ తీసుకోనందుకు విద్యార్థినిపై తీవ్ర దాడికి దిగిన తోటి విద్యార్థినిలు

Girls booked for thrashing classmate in Lahore school get pre-arrest bail

Pakistan: పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ ప్రాంతంలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వెలువడిన షాకింగ్ వీడియోలో, కొంత మంది అమ్మాయిలు తోటి క్లాస్‌మేట్‌పై క్రూరంగా దాడి చేయడం కనిపించింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నలుగురు యువతులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఒక్కొక్కరికి 50,000 రూపాయల పూచీకత్తుతో పలు షరతులపై బెయిల్ మంజూరు చేసింది అక్కడి సెషన్స్ కోర్టు.

Shahrukh and Sharma: ప్రభుత్వాన్ని నడపడానికి సంఘీలు ఇక కాంగ్రెస్ వైపు చూడాలి.. షారూఖ్, శర్మ కాంట్రవర్సీపై కాంగ్రెస్

ఇంతకీ విషయం ఏంటంటే.. డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడ్డ ఆ విద్యార్థినిలు తోటి విద్యార్థి కూడా డ్రగ్స్ తీసుకొమ్మని బలవంత పెట్టారు. అయితే ఈ విద్యార్థి అందుకు నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని నేలపై పడేసి తల పట్టుకుని కొట్టడం వీడియోలో చూడొచ్చు. తమకు క్షమాపణ చెప్పాలని బాధితురాలిని సహ విద్యార్థులు పదే పదే ఒత్తిడి తెచ్చారు. తాను అమ్మాయినని, తనపై ఈ దాడి ఆపమని బాధితురాలు ప్రాధేయపడుతున్నప్పటికీ, తమకు క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టేది లేదని ఆ విద్యార్థులు చెప్పడం వీడియోలో చూడొచ్చు. ఆమెను తిడుతూ కొట్టారు కూడా.


ఈ వీడియో డిఫెన్స్ లాహోర్‌లోని స్కార్స్‌డేల్ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి వచ్చినట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యుడు మహీన్ ఫైసల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రౌడీ అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మద్యం తాగడానికి నిరాకరించినందుకు బాలికపై సహవిద్యార్థులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన దుండగుల కంపెనీలో చేరేందుకు నిరాకరించినందుకే తన కుమార్తెను కొట్టారని బాధిత బాలిక తండ్రి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు.

Karnataka: అరటిపళ్లు, చిక్కీ కాదు గుడ్లు కావాలి.. 80% స్కూలు పిల్లల అభిప్రాయమిది