Story Of Curdi : ఆ గ్రామం 11 నెలలు నీటిలోనే..వేసవిలో తేలుతుంది

Story Of Curdi : ఆ గ్రామం 11 నెలలు నీటిలోనే..వేసవిలో తేలుతుంది

Salaulim river

Goa Village : అవును మీరు చదువుతున్నది నిజమే. 11 నెలల పాటు ఆ గ్రామం నీటిలోనే ఉండనుంది వేసవిలో మాత్రమే పైకి తేలుతుంది. ఇలాంటి ప్రదేశాన్ని చూసేందుకు పర్యాటకులు, గ్రామస్తులు పోటెత్తుతుంటారు. తేలిన సందర్భంలో దీనిని చూడటానికి రెండు కళ్లు చాలవని, అందమైన దృశ్యాన్ని చూసేందుకు ఉత్సాహం చూపుతుంటామంటుంటారు. ఈ గ్రామం గోవాలో ఉంది.

కారణం ఏంటీ ?

గోవాలోని కుర్ది గ్రామం. పశ్చిమ కనుమల్లో కొండల మధ్యలో సలౌలిం నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పరీవాహక ప్రాంతంలో కుర్దీ గ్రామం ఉంది. 1986లో ఆ నదిపై ఆనకట్ట నిర్మించారు. దీని మూలంగా..ఆ గ్రామం మొత్తం నీట మునిగిపోయింది. కానీ..11 నెలలు గ్రామం నీటిలో ఉన్నా..వేసవిలో మాత్రం పైకి తేలుతుంది. జలాశయంలో ఉండే నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల గ్రామానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతాయి.
ఆనకట్ట కోసం తమ గ్రామాన్ని ఇచ్చిన ప్రజలు…ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండేవారు.. ఇక్కడకు వస్తుంటారు.

ఆ ఒక్క నెల రోజులు ఎంతో సంతోషంగా..ఆనందంగా గడుపుతుంటారు. శిథిలమైన తమ ఇళ్లను, ఆనాడు తాము తిరిగిన ప్రాంతాలను గుర్తు చేసుకుంటుంటారు. అప్పుడు..ఛర్చీ, ఒక దేవాలయం ఉండేది. ఇవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆయా వర్గాల వారు..అందులోనే తమ దైవాలను ప్రార్థిస్తుంటారు. విందులు, వినోదాలు చేసుకుంటుంటారు. వర్షాలు ప్రారంభం కాగానే…జలాశయంలో నీరు నిండి.. ఒక దశలో ఓ దీవిలా కనిపిస్తుంది ఈ గ్రామం. అందమైన దృశ్యాన్ని చూడడం కోసం పర్యాటకులు, గ్రామస్తులు అక్కడకు వెళుతుంటారు.