Mask లేదని మేక అరెస్టు

  • Published By: madhu ,Published On : July 28, 2020 / 06:57 AM IST
Mask లేదని మేక అరెస్టు

కరోనా వేళ మాస్క్ కంపల్సరి అయిపోయింది. నిత్యజీవితంలో ఇదొక భాగమయ్యే పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్లిన సమయంలో తప్పకుండా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఇదొక్క మనుషులకే మాత్రం కాదని..జంతువులకు కూడా వర్తిస్తుందని కొన్ని ఘటనలు చూస్తే అర్థమౌతోంది.

కొంతమంది జంతువులకు మాస్క్ లు తొడుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంచితే…మాస్క్ పెట్టుకోలేదని ఓ మేకను పోలీసులు అరెస్టు చేసిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బెకన్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

రోడ్డుపై ఓ యజమాని మేకను తీసుకెళుతున్నాడు. అక్కడనే ఉన్న పోలీసులు అడ్డగించారు. మేకకు ఎందుకు మాస్క్ పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు ఆ యజమానికి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. భయం కావడంతో మేకను అక్కడనే వదిలేసి పరార్ అయ్యాడు. పోలీసులు మేకను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

కాసేపటికి యజమాని అక్కడకు వచ్చి చూడగా..మేక కనిపించలేదు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. మాస్క్ లేకపోవడంతో అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఎలాగోలా..పోలీసులను బతిమాలుకున్నడు. దీంతో వారు మేకను వదిలిపెట్టారు. బతుకు జీవుడా..అంటూ..ఆ మేకను తీసుకుని ఇంటికి బయలుదేరాడు.

మేకను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తే..కరెక్టే అంటున్నారు పోలీసులు. కుక్కలకు కూడా మాస్క్ లు పెడుతున్నప్పుడు మేకకు ఎందుకు పెట్టరని అంటున్నారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియలో హల్ చల్ చేస్తున్నాయి.