Gold Price : పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజూ పెరిగిన ధర

పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి పరుగులు తీస్తోంది. వ‌రుస‌గా రెండో రోజూ బంగారం ధర పెరిగింది. శుక్రవారం(ఆగస్టు 13,2021) ఢిల్లీ మార్కెట్ లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన పుత్తడి ధ‌ర రూ.222 పెరిగి రూ.45వేల 586కు చేరింది. క్రితం ట్రేడ్ లో 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ.45,364 దగ్గర ముగిసింది.

Gold Price : పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజూ పెరిగిన ధర

Gold Price Today

Gold Price Today : పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి పరుగులు తీస్తోంది. వ‌రుస‌గా రెండో రోజూ బంగారం ధర పెరిగింది. శుక్రవారం(ఆగస్టు 13,2021) ఢిల్లీ మార్కెట్ లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన పుత్తడి ధ‌ర రూ.222 పెరిగి రూ.45వేల 586కు చేరింది. క్రితం ట్రేడ్ లో 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ.45,364 దగ్గర ముగిసింది.

వెండి ధ‌ర‌లు కూడా ఇవాళ స్వ‌ల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.100 పెరిగి రూ.61,045 ప‌లికింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.60,945 దగ్గర ముగిసింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1,757 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది. ఔన్స్ వెండి ధ‌ర 23.30 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది.

Gold Loan : గోల్డ్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్

అంత‌ర్జాతీయంగా విలువైన లోహాల ధ‌ర పెరగ‌డం, రూపాయి మార‌కం విలువ కొంత బ‌ల‌హీన‌ప‌డ‌టం దేశీయంగా బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరగ‌డానికి కార‌ణ‌మ‌ని బులియన్ మార్కెట్ నిపుణులు తెలిపారు.

ఆగస్టులో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఆగస్టు 12న దానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఒక్కరోజులో 300 రూపాయలకు పైగా బంగారం ధర పెరిగింది. ఇది ఇలా ఉంటే కేవలం గత వారం రోజుల్లో బంగారం ధర 1,500 రూపాయలకు పైగా పడిపోయింది. ఈ నెలలో పసిడి ధర పెరిగడం ఇది రెండోసారి. జులై 31 నుంచి బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఆగస్టులో మళ్లీ పసిడి రేట్లు పెరిగాయి.