Harmonium in Golden temple: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు
హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్) ప్రార్థనల్లో హార్మోనియం వాయిద్య పరికరాన్ని తొలగించాలని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్ జిపిసి)ను కోరారు.

Harmonium in Golden temple: గొప్ప ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ విలువలు కలిగి ఉన్న సిక్కు మతంలో, కీర్తనలు, గుర్బానీ భజనలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సందర్భాన్ని భట్టి ఆయా భజనల్లో గంటలు, తబలా, హార్మోనియం వంటి సంగీత వాయిద్య పరికరాలు వినియోగిస్తుంటారు. ముఖ్యంగా అమృత్‌సర్ లోని సిక్కుల దేవాలయం ‘శ్రీ హర్మందిర్ సాహిబ్’లో నిత్యం ప్రార్ధనలు కొనసాగుతుంటాయి. అయితే ఇటీవల, సిక్కు మతంలోని ఐదు మతాధికారులలో ఒకరైన అకాల్ తఖ్త్ కు చెందిన జతేదార్, జియానీ హర్ ప్రీత్ సింగ్..హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్) ప్రార్థనల్లో హార్మోనియం వాయిద్య పరికరాన్ని తొలగించాలని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్ జిపిసి)ను కోరారు.
other stories:Kedarnath Yatra: భారీ వర్షాలతో నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర
కీర్తన్ కమిటీ నుండి హార్మోనియంలను తొలగించడానికి తఖ్త్ పరిపాలన అధికారులు మూడు సంవత్సరాల గడువు ఇచ్చింది. నిజమైన సిక్కు సంప్రదాయాలకు అనుగుణంగా లేనందున హార్మోనియంను తొలగించాలని నిర్ణయించినట్లు అకాల్ తఖ్త్ పేర్కొంది. గురుద్వారా లోపల కీర్తనలు, గుర్బానీల భజనల్లో సాంప్రదాయ తీగ వాయిద్యాలను ఉపయోగించాలని కోరింది. అయితే స్వర్ణ దేవాలయంలో కీర్తనల నుండి హార్మోనియం తొలగింపు విషయంలో కొందరు సిక్కుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సిక్కు మత భజనల నుంచి హార్మోనియంను తొలగించే విషయంపై గుర్మత్ సంగీత్ లోని పండితుల బృందం ఈ చర్యను సమర్ధించింది.
other stories:Tiruchanur : జూన్ 10 నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
హార్మోనియం బ్రిటిష్ వారిచే ప్రవేశపెట్టబడిందని మరియు నిజమైన సాంప్రదాయ భారతీయ సంగీతంతో దీనికి పోలిక లేదని అకాల్ తఖ్త్ వివరణ ఇచ్చింది. పాత సంప్రదాయాల పునరుద్ధరణలో భాగంగా పాశ్చాత్య వాయిద్యాలను వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. సిక్కు మతంలో మొట్టమొదటి కీర్తన గాయకుడు గురునానక్ దేవ్ జీ. ఆ సమయంలో భారతీయ సంప్రదాయ సిక్కు సంగీతంలో హార్మోనియం భాగం కాదని కొందరు మతపెద్దలు అభిప్రాయపడుతున్నారు. బ్రిటీష్ వారి రాకకు ముందు, ప్రతి గురుద్వారాకు కీర్తనల కోసం ఒక ఆస్తి ఉండేది.
Other Stories:Tirumala Temple: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు నెల కోటా రేపు విడుదల
దానిలో కొంత భాగం రబ్బీలు మరియు సిక్కు కీర్తనలకు వెళ్ళింది. రాగులు, రబీలకు మద్దతు ఇచ్చే ఈ వ్యవస్థ బ్రిటిష్ వారి రాకతో కనుమరుగైంది. గుర్మత్ సంగీత్ పండితుల బృందం కీర్తన్ బృందాల నుండి హార్మోనియంను దశలవారీగా తొలగించే చర్యకు మద్దతు ఇస్తుండగా, కొందరు వాయిద్యకారులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. హార్మోనియం ఇప్పుడు హిందుస్తానీ సంగీతంలో అంతర్భాగంగా మారిందని నమ్మే కొంతమంది పండితులు చెప్పుకొస్తున్నారు.
1Pooja Hegde : తమిళ్ వాళ్ళకి కూడా పూజాహెగ్డేనే కావాలంట..
2Maharashtra: మెర్సిడెస్ కారును ఆటో రిక్షా వదిలేసి వచ్చింది: ఉద్ధవ్‌కు సీఎం ఏక్నాథ్ షిండే కౌంటర్
3Tollywood : అప్పుడే దసరాకి మొదలైన ఫైట్.. స్టార్లంతా సిద్ధం..
4Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
5Enforcement Directorate: హైదరాబాద్ సహా దేశంలోని 44 ప్రాంతాల్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఈడీ దాడులు
6Tamannaah : తమన్నా ఇష్టాయిష్టాలు.. తమన్నా కష్టాలు.. ఫ్యాన్స్‌తో స్పెషల్ చిట్ చాట్..
7LPG cylinder: మళ్ళీ పెరిగిన వంట గ్యాస్ ధరలు
8Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం
9777 Charlie : కుక్క మీద తీసిన సినిమా.. లాభాల్లో 5 శాతం కుక్కలకే..
10medicines: మధుమేహం, రక్తపోటు సహా పలు రకాల ఔషధాల ధరల తగ్గింపు
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?