Indian Air Force : భార‌త వైమానిక ద‌ళంలో కొత్త‌గా వెప‌న్ సిస్ట‌మ్ బ్రాంచ్.. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఇదే తొలిసారి

భార‌త వైమానిక ద‌ళంలో ఆఫీస‌ర్ల రిక్రూట్మెంట్ కోసం వెప‌న్ సిస్ట‌మ్ బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన‌ట్లు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వివేక్ రామ్ చౌద‌రీ తెలిపారు. భార‌త వైమానిక ద‌ళం 90వ వార్సికోత్స‌వ కార్య‌క్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇది చ‌రిత్రాత్మ‌క‌మైన సంద‌ర్భ‌మ‌ని అన్నారు.

Indian Air Force : భార‌త వైమానిక ద‌ళంలో కొత్త‌గా వెప‌న్ సిస్ట‌మ్ బ్రాంచ్.. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఇదే తొలిసారి

air chief marshal vivek ram chaudhari

Indian Air Force : భార‌త వైమానిక ద‌ళంలో ఆఫీస‌ర్ల రిక్రూట్మెంట్ కోసం వెప‌న్ సిస్ట‌మ్ బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన‌ట్లు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వివేక్ రామ్ చౌద‌రీ తెలిపారు. భార‌త వైమానిక ద‌ళం 90వ వార్సికోత్స‌వ కార్య‌క్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇది చ‌రిత్రాత్మ‌క‌మైన సంద‌ర్భ‌మ‌ని అన్నారు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఐఏఎఫ్‌లో ఆప‌రేష‌న్ బ్రాంచ్‌ను క్రియేట్ చేయ‌డం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

వెప‌న్ సిస్ట‌మ్ శాఖ వ‌ల్ల ఫ్ల‌యింగ్ శిక్ష‌ణ కోసం అయ్యే ఖ‌ర్చుల్లో సుమారు రూ.3400 కోట్ల‌ను ఆదా చేయ‌వ‌చ్చు అని చౌద‌రీ తెలిపారు. అగ్నిప‌థ్ స్కీమ్ ద్వారా వైమానిక ద‌ళంలోకి ఎయిర్ వారియ‌ర్ల‌ను ర్రికూట్ చేయ‌డం ఓ పెద్ద స‌వాల్ అన్నారు. కానీ దేశంలోని యువ‌త సామ‌ర్థ్యాన్ని గుర్తించి, వారిని దేశ సేవ కోసం వినియోగించుకోవాల‌ని చెప్పారు. అగ్నివీరుల శిక్ష‌ణ విధానాన్ని మార్చామ‌ని తెలిపారు. ఐఏఎఫ్‌లో కెరీర్‌ను కొన‌సాగించేందుకు త‌గిన రీతిలో వారిని సిద్ధం చేస్తున్న‌ట్లు వెల్లడించారు.

Agnipath: ‘అగ్నిప‌థ్’ కింద వైమానిక ద‌ళంలో ఉద్యోగాల‌కు 6 రోజుల్లో 2 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు

ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ముడు వేల మంది అగ్నివీరుల‌కు వాయు సేన కోసం శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ సంఖ్య‌ను మున్ముందు పెంచ‌నున్న‌ట్లు తెలిపారు. వ‌చ్చే ఏడాది నుంచి మ‌హిళా అగ్నివీరుల్ని ర్రికూట్ చేసేందుకు ప్లాన్ వేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. దీని కోసం మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో నిమ‌గ్న‌మైన‌ట్లు వెల్ల‌డించారు. 90వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా భార‌త వైమానిక ద‌ళం కొత్త యూనిఫామ్‌ను ఆవిష్క‌రించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.