IPL 2022 Final: నేడు ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌.. గెలుపు అవ‌కాశాలు ఎవ‌రికి ఎక్కువ‌ అంటే..

అస‌లుసిస‌లైన క్రికెట్ యుద్ధం మ‌రి కొద్ది గంట‌ల్లో మొద‌లు కాబోతోంది.. హోరాహోరీగా సాగిన ఐపీఎల్ పోరులో రెండు జ‌ట్లు ఫైన‌ల్‌కు చేరాయి. ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ‌ధ్య పోరు షురూ కానుంది. ఇక్క‌డ విశేషం ఏమిటంటే ప్ర‌స్తుతం ఫైన‌ల్ లో ఆడే రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఐపీఎల్ ప్రారంభంలో తొలి టోర్నీలో విజేత‌గా నిలిచింది. తిరిగి 14ఏళ్ల త‌రువాత తుదిపోరులో అడుగు పెట్టింది. మ‌రోవైపు...

IPL 2022 Final: నేడు ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌.. గెలుపు అవ‌కాశాలు ఎవ‌రికి ఎక్కువ‌ అంటే..

Ipl

IPL 2022 Final: అస‌లుసిస‌లైన క్రికెట్ యుద్ధం మ‌రి కొద్ది గంట‌ల్లో మొద‌లు కాబోతోంది.. హోరాహోరీగా సాగిన ఐపీఎల్ పోరులో రెండు జ‌ట్లు ఫైన‌ల్‌కు చేరాయి. ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ‌ధ్య పోరు షురూ కానుంది. ఇక్క‌డ విశేషం ఏమిటంటే ప్ర‌స్తుతం ఫైన‌ల్ లో ఆడే రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఐపీఎల్ ప్రారంభంలో తొలి టోర్నీలో విజేత‌గా నిలిచింది. తిరిగి 14ఏళ్ల త‌రువాత తుదిపోరులో అడుగు పెట్టింది. మ‌రోవైపు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు టోర్నీలో అడుగుపెట్టిన తొలిసారే పైన‌ల్ కు చేరింది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య తుదిపోరు ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. రెండు జ‌ట్లు బ్యాటింగ్‌, బౌలింగ్ లో బ‌లంగా ఉండ‌టంతో క్రికెట్ అభిమానుల‌కు ఈ రోజు పెద్ద పండుగ అని చెప్ప‌వ‌చ్చు.

IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్‌ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!

ఐపీఎల్ లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్ అరంగ్రేట సీజన్‌లోనే అదిరిపోయే ప్రదర్శన కనబర్చింది. లీగ్‌ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో పదింట నెగ్గి పాయింట్ల పట్టిక టాప్‌లో నిలిచిన గుజరాత్‌.. తొలి క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌పై అలవోక విజయంతో ఫైనల్‌కు చేరింది. ఎక్క‌డా ఎటువంటి బెరుకు లేకుండా సాగిన గుజ‌రాత్ టైటాన్స్ కు ఫైన‌ల్ మ్యాచ్ పెద్ద ప‌రీక్ష‌గా నిల‌వ‌నుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ మూడు రంగాల్లో జ‌ట్టు బ‌లంగా ఉంది. శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా రూపంలో మంచి ఓపెనింగ్‌ జోడీ అందుబాటులో ఉండగా.. వన్‌డౌన్‌లో మాథ్యూ వేడ్‌, ఆ తర్వాత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా క్రీజులోకి వస్తున్నారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు క్లిక్‌ అయినా గుజరాత్‌ భారీ స్కోరుకు బాటలు పడటం ఖాయమే. ఇక మిడిలార్డర్‌లో డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా రూపంలో ఇద్దరు భీకర హిట్టర్లు ఉండటం టైటాన్స్‌కు కలిసి రానుంది. ఇక బౌలింగ్ లో ష‌మీ, ర‌షీద్, జోసెఫ్ లు రాణిస్తున్నారు. ఫైన‌ల్ లో మెరుగైన బౌలింగ్ చేయ‌గ‌లిగితే గుజ‌రాత్ టైటాన్స్ గెలుపును అడ్డుకోవ‌టం రాజ‌స్థాన్‌కు క‌ష్టంగా మార‌డం ఖాయ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్

ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ అద్వితీయ ఆటతీరుతో ఐపీఎల్‌-15 ఫైనల్‌కు దూసుకొచ్చింది. రాజ‌స్థాన్ జ‌ట్టును బ్యాంటింగ్ లో ఒంటిచేత్తో గెలిపించ‌గ‌ల సామ‌ర్థ్యం ఇద్ద‌రికే ఉంది. ఒక‌రు జోన్ బ‌ట్ల‌ర్‌, మ‌రొక‌రు కెప్టెన్ సామ్స‌న్‌. బ్యాటింగ్‌లో జోస్‌ బట్లర్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. బ‌ట్ల‌ర్‌, సామ్స‌న్ లో ఎవ‌రోఒక్క‌రు రెచ్చిపోయిన గుజ‌రాత్ టైటాన్స్ కు ఫైన‌ల్ లో ప‌రాభావం ఖాయ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఒక రాజ‌స్థాన్ జ‌ట్టులో బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహాల్‌ దుమ్మురేపుతున్నాడు. చాహ‌ల్‌ 19.50 సగటుతో 26 వికెట్లు పడగొట్టి వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే గుజ‌రాత్ టైటాన్స్‌, రాజ‌స్థాన్ జ‌ట్లు అన్ని విభాగాల్లో బ‌లంగానే ఉన్న‌ప్ప‌టికీ ఫైన‌ల్ పోరులో ఎవ‌రు నెగ్గుతార‌ని క్రికెట్ ప్రియులు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.

IPL 2022: దినేశ్ కార్తీక్‌కు వార్నింగ్.. ఫస్ట్ టైం కాబట్టే వదిలేశారట

తుది జట్ల వివరాలు (అంచనా)
గుజరాత్‌: హార్దిక్‌ (కెప్టెన్‌), సాహా, గిల్, వేడ్, మిల్లర్, తెవాటియా, రషీద్, సాయికిషోర్, జోసెఫ్, యశ్‌ దయాళ్, షమీ.
రాజస్తాన్‌: సామ్సన్‌ (కెప్టెన్‌), యశస్వి, బట్లర్, పడిక్కల్, హెట్‌మైర్, పరాగ్, అశ్విన్, బౌల్ట్, చహల్, ప్రసిధ్, మెక్‌కాయ్‌.