pet dog name : మా కుక్కను ‘కుక్క’అంటారా? పేరు పెట్టి పిలవరా? అంటూ పొరుగింటిపై కర్రలతో దాడి చేసిన వ్యక్తి

pet dog name : మా కుక్కను ‘కుక్క’అంటారా? పేరు పెట్టి పిలవరా? అంటూ పొరుగింటిపై కర్రలతో దాడి చేసిన వ్యక్తి

No Permission For Corona Patient Attendants (1)

Gurugram family pet dog in name Issue : కుక్కను ‘కుక్క’ అంటే తప్పా? అని అడిగితే మరి కుక్కను కుక్క అనకుండా నక్కా అని పిలుస్తారా? ఏంటీ అనొచ్చు, కానీ ఓ కుక్కను పెంచుకునే దాని యజమాని మాత్రం కుక్క అని అంటూ ఊరుకోను అంటూ ఎదురింటి వారిపై కర్రలతో దాడిచేసిన ఘటన గురించి వింటే కుక్క అని అనటానికి కూడా భయపడాలేమోననిపిస్తుంది. ఓ వ్యక్తి మా కుక్కును కుక్క అని పిలుస్తావా? అంటూ ఏకంగా ఎదురింటివారిపై కర్రలతో దాడిచేసి దారుణంగా గాయపరిచన ఘటన గురుగ్రామంలో చోటుచేసుకుంది. మీ కుక్క మీకు ఎక్కువైతే దాన్ని ఇంట్లో కట్టేసుకోండీ..వీధిలోకి వదిలి దారి వెంట పోయేవారిని ఎందుకు ఇబ్బంది పెడతారు? అని అన్న పాపానికి దారుణంగా పెంపుడు కుక్క యజమాని చేసిన దాడిలో గాయాలు పాలైన వ్యక్తి వాపోయాడు.

గురుగ్రామ్‌లోని సైబర్‌సిటీలో నివసించే సుధీర్ అనే వ్యక్తి ‘‘మీ కుక్క రోడ్ల‌పై తిరుగుతూ అంద‌రినీ భ‌య‌ప‌పెడుతోంది…దయచేసి దాన్ని మీ ఇంట్లో కట్టేయండి అని చెప్పాడు. దానికి ఆ కుక్కను పెంచుకునే యజమానికి ఇంత లావు పౌరుషం పొడుచుకొచ్చింది. అతే మా పెంపుడు కుక్కను కుక్క అంటావా? దానికో పేరు ఉంది. ఆ పేరుతో పిలవకుండా కుక్క అంటావా? అంటూ ఏకంగా య‌జ‌మాని సుధీర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

అంత‌టితో ఊరుకున్నాడా ఏంటీ..ఏకంగా ఆ కుక్క య‌జ‌మానితో పాటు అతని కుటుంబ‌స‌భ్యులంతా క‌ల‌సి పొరుగుంట్లో ఉంటున్న సుధీర్ కుటుంబ స‌భ్యుల‌పై క‌ర్ర‌ల‌తో దాడి చేసారు. తీవ్రంగా గాయ‌ప‌రిచారు. కుక్క గురించి చెబితే దాడికి వస్తారని ఏమాత్రం ఊహించని సుధీర్ షాక్ అయ్యాడు. ఆ షాక్ నుంచి అతను కోలుకోకుండానే జరగాల్సింది జరిగిపోయింది. ఈ దాడిలో సుధీర్ ఇంటిలోని ఆరుగురు గాయాల‌పాల‌య్యారు.

ఈ దారుణ ఘటన తరువాత సుధీర్ గురుగ్రామ్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. అనంతం కేసు నమోదు చేసుకుని సదరు ‘కుక్క’ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సుదీర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఆ కుక్క త‌మ పిల్ల‌ల‌ను వెంబ‌డిస్తూ, క‌రిచేందుకు ప్ర‌య‌త్నించిందని..దారి వెంట పోయేవారిని కూడా భయపెడుతోందని..అందుకే ఆ కుక్క‌ యజమానితో ‘‘మీ కుక్కను ఇంటిలో క‌ట్టుకోవాల‌ని చెప్పాన‌ని దానికే వారు మీ కుటుంబంపై దాడికి దిగార‌ని సుధీర్ వాపోయాడు.