Happiest Cities : ఈ నగరాల్లో ఇల్లు కొనుగోలు చేస్తే జీవితమంతా ఫుల్ హ్యాపీ.. భారత్‌లో ఎక్కడ అంటే..

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. పేద, ధనికులు అనే తేడా లేదు. తమకంటూ సొంతిల్లు ఉండాలని కోరుకోని వారు ఉండరు. సొంతిల్లు ఒక కల అయితే, ఆ ఇంట్లో ఆనందంగా ఉండాలని కోరుకోవడం మరో డ్రీమ్. మరి, అలాం

Happiest Cities : ఈ నగరాల్లో ఇల్లు కొనుగోలు చేస్తే జీవితమంతా ఫుల్ హ్యాపీ.. భారత్‌లో ఎక్కడ అంటే..

Happiest Cities

Happiest Cities : సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. పేద, ధనికులు అనే తేడా లేదు. తమకంటూ సొంతిల్లు ఉండాలని కోరుకోని వారు ఉండరు. సొంతిల్లు ఒక కల అయితే, ఆ ఇంట్లో ఆనందంగా ఉండాలని కోరుకోవడం మరో డ్రీమ్. మరి, అలాంటి చోటు ఎక్కడ ఉంది? ఏ నగరంలో అయితే మన హ్యాపీగా ఉండగలం? ఇదే విషయంపై ఓ సర్వే సంస్థ పరిశోధన చేసింది. ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఇల్లు కొని హ్యాపీగా ఉండగలిగే టాప్‌ 20 ఆనంద నగరాల జాబితాను రూపొందించింది. వీటిలో ఐదు నగరాలు భారత్‌లోనే ఉండటం విశేషం.

యూకే చెందిన ఆన్‌లైన్‌ మోర్ట్ గేజ్‌ అడ్వయిజర్‌ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో తొలి స్థానంలో స్పెయిన్‌లోని బార్సిలోనా నిలవగా.. భారత్‌లోని లక్నో 20వ స్థానం దక్కించుకుంది.

Gita Shares : జాక్ పాట్ .. ఏడాదిలో రూ. లక్ష పెట్టుబడితో రూ.42 లక్షల సంపాదన

1. బార్సిలోనా, స్పెయిన్‌
2. ఫ్లోరెన్స్‌, ఇటలీ
3. ఉల్సాన్‌, దక్షిణ కొరియా
4. ప్రాగ్వే, చెక్‌ రిపబ్లిక్‌
5. ఛండీగఢ్‌, భారత్‌
6. కటోవైస్‌, పోలాండ్‌
7. ఇస్లామాబాద్‌, పాకిస్తాన్
8. బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌
9. బెర్లిన్‌, జర్మనీ
10. జయపుర, భారత్‌
11. గుడాన్స్క్‌, పోలాండ్‌
12. ఫ్రాంక్‌ఫర్ట్‌, జర్మనీ
13. చెన్నై, భారత్‌
14. బుసాన్‌, దక్షిణ కొరియా
15. టోక్యో, జపాన్‌
16. అట్లాంటా, యూఎస్‌ఏ
17. లూయిస్‌విల్లె, యూఎస్‌ఏ
18. ఇండోర్‌, భారత్
19. ఫోర్ట్‌వార్త్‌ యూఎస్‌ఏ
20. లక్నో, భారత్‌

సంస్థ విశ్లేషకులు ప్రపంచవ్యాప్తంగా జియో ట్యాగ్డ్ ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్టులు ఉపయోగించి ఈ జాబితా రూపొందించారు. వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఇల్లు కొనుగోలు చేసిన వారికి సంబంధించి జియో ట్యాగింగ్‌ ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ సెల్ఫీ ఫొటోలను సేకరించి విశ్లేషించారు. సాధారణ ఇన్‌స్టా యూజర్‌ ముఖంలోని సంతోషాన్ని, వీరి ముఖంలో ఉన్న సంతోషాన్ని పోల్చి చూశారు. అందులో ఉన్న వ్యత్యాసం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

Android Phones Hack: మీ ఫోన్‌లో వైరస్ ఇలా గుర్తించండి.. వెంటనే తీసేయండి..!

హ్యాపియస్ట్ సిటీస్ లిస్టే కాదండోయ్.. టాప్‌ 20 అతి తక్కువ ఆనంద నగరాల లిస్ట్ కూడా వీరు తయారు చేశారు. అందులోనూ భారత్‌కు చెందిన రెండు నగరాలు ఉన్నాయి. ఈ జాబితాలో తొలి స్థానం ముంబై నగరానిది కాగా.. ఐదో స్థానంలో సూరత్‌ ఉంది. ఆఖరి స్థానం అగ్రరాజ్యం అమెరికాలోని ఫీనిక్స్‌ది.