Gita Shares : జాక్ పాట్ .. ఏడాదిలో రూ. లక్ష పెట్టుబడితో రూ.42 లక్షల సంపాదన

అదృష్టం అంటే వీరిదే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నక్క తోక తొక్కడం అంటే ఇదే. అవును మరి.. ఏడాదిలో లక్ష రూపాయల పెట్టుబడితో రూ.42లక్షలు సంపాదించడం అంటే మాటలా? వారి విషయంలో ఇది నిజమైంద

Gita Shares : జాక్ పాట్ .. ఏడాదిలో రూ. లక్ష పెట్టుబడితో రూ.42 లక్షల సంపాదన

Gita Shares

Gita Renewable Energy Shares : అదృష్టం అంటే వీరిదే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నక్క తోక తొక్కడం అంటే ఇదే. అవును మరి.. ఏడాదిలో లక్ష రూపాయల పెట్టుబడితో రూ.42లక్షలు సంపాదించడం అంటే మాటలా? వారి విషయంలో ఇది నిజమైంది.

గీతా రెన్యువబుల్ ఎనర్జీ షేర్.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం దాని షేర్ ధర ఎవరూ ఊహించని రీతిలో పెరిగింది. షేర్ ధర ఏడాది కాలంలో అమాంతం పెరిగింది. ఈ బీఎస్ఈ లిస్టెడ్ ఎనర్జీ స్టాక్ ధర ఒక ఏడాదిలో రూ.5.52 నుంచి రూ233.50కు పెరిగింది. అంటే ఏడాదిలో కాలంలో ఏకంగా 4130 శాతం జంప్ అయ్యిందన్న మాట.

Android Phones Hack: మీ ఫోన్‌లో వైరస్ ఇలా గుర్తించండి.. వెంటనే తీసేయండి..!

ఇంకా సులభంగా చెప్పాలంటే మీరు గనుక గతేడాది రూ. 1 లక్ష విలువ గల షేర్లు కొని ఉంటే మీరు కేవలం ఏడాదిలో ఎటువంటి పని చేయకున్నా రూ.42 లక్షలు సంపాదించే వారు. వారం క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు అవి రూ.1.21 లక్షలు అయ్యేవి.

Samantha : సినిమా చేయాలంటే కొత్త కండిషన్లు పెడుతున్న సమంత.. విడాకుల ఎఫెక్ట్?

స్టాక్ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ లలో పెట్టుబడి పెట్టడం తప్పు కాదు. కానీ, ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా పెట్టుబడి పెట్టడం ముమ్మాటికి తప్పే. అలాగే, మీరు పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ చరిత్ర, భవిష్యత్ తెలుసుకోవడం చాలా మంచిది. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్లు రిస్కుతో కూడుకున్నవి. వీటిలో పెట్టుబడి పెడితే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వొచ్చు, నష్టాలొస్తే బిచ్చగాడు కావొచ్చు.