Indian Embassy In UK: భారత్ రియాక్షన్‌తో లండన్‌లో మారిన సీన్.. భారత ఎంబసీ ముందు టైట్ సెక్యూరిటీ
ఇదే విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లండన్‌లోని భారత హైకమిషనరేట్ ముందున్న త్రివర్ణ పతాకాన్ని తొలగించే ప్రయత్నం జరిగిన చాలా తరువాత లండన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాస్తవానికి ఇదే భారత్‌కు కోపాన్ని తెప్పించింది. ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తల నుంచి మరిన్ని నిరసనలు హింసాత్మకంగా మారే అవకాశాలపై బ్రిటన్ అధికారులతో భారత ఇంటెలిజెన్స్ విభాగం చర్చించినట్లు తెలుస్తోంది.

Heavy Security Keeps At Indian Mission In UK
Indian Embassy In UK: కొద్ది రోజుల క్రితం బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉన్న భారత హైకమిషనరేట్ ముందు ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు తొలగించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. త్రివర్ణ పతాకాన్ని తొలగించి ఖలిస్తానీ జెండా ఎగరవేద్దామనుకున్నారు కానీ, ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. అయితే ఈ చర్యలో ఖలిస్తానీ మద్దతుదారుల అరాచకత్వం కనిపిస్తూనే ఉన్నప్పటికీ, బ్రిటన్ ప్రభుత్వం నిర్వహణాలోపం కూడా స్పష్టంగానే తెలుస్తోంది. లండన్‌లో భారత్‌కు జరిగిన ఈ అవమానానికి ప్రతిచర్య బలంగానే తగిలింది. ఢిల్లీలోని బ్రిటన్ ఎంబసీ ముందున్న బారీకేడ్లను తాజాగా తొలగించారు.
Karnataka Polls: ఎటూ తేల్చని బీజేపీ అధిష్టానం.. మళ్లీ ముఖ్యమంత్రి తానేనంటున్న బొమ్మై
ఢిల్లీలో భారత్ ఇలా చర్యలకు దిగిందో లేదో బ్రిటన్ లో సీన్ మారిపోయింది. భారత హైకమిషనరేట్ కి ముందు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎప్పటికప్పుడు గస్తీ కాస్తూ కఠిన భద్రత కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైతం కొందరు ఖలిస్తానీ అనుకూలురు అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. అయితే వారిని రోడ్డుకు అవతలే ఆపేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 20 పోలీసు బస్సులు భారత ఎంబసీకి చేరుకున్నాయి. అందులో నుంచి పదుల సంఖ్యలో దిగిన పోలీసులు.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
Governor Tamilisai Soundararajan : TSPSC పేపర్ లీక్ కేసు.. గవర్నర్ సీరియస్, హాట్ కామెంట్స్
ఇక తాజాగా ఢిల్లీలోని బ్రిటన్ ఎంబసీ ముందు బారికేడ్లు తొలగించడాన్ని దెబ్బకు దెబ్బ అన్న చందంగా కొందరు వర్ణిస్తున్నారు. చాణక్యపురి ఎంబసీ ఎన్‌క్లేవ్‌లోని శాంతిపథ్ వద్ద బ్రిటన్ మిషన్ వెలుపల ఉంచిన బారికేడ్లు, రాజాజీ మార్గ్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ నివాసం వరకు తొలగించారు. ఆదివారం నాడు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల జరిగిన హింసాత్మక నిరసనపై ప్రభుత్వ అత్యున్నత స్థాయి అంచనాను అనుసరించి ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ చర్యపై ఇండియాలోని బ్రిటన్ హైకమిషనర్ స్పందిస్తూ తాము భద్రతా విషయాలపై వ్యాఖ్యానించమని అన్నారు.
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషుల ముందస్తు విడుదలపై సుప్రీం సంచలన నిర్ణయం
కాగా, ఇదే విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లండన్‌లోని భారత హైకమిషనరేట్ ముందున్న త్రివర్ణ పతాకాన్ని తొలగించే ప్రయత్నం జరిగిన చాలా తరువాత లండన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాస్తవానికి ఇదే భారత్‌కు కోపాన్ని తెప్పించింది. ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తల నుంచి మరిన్ని నిరసనలు హింసాత్మకంగా మారే అవకాశాలపై బ్రిటన్ అధికారులతో భారత ఇంటెలిజెన్స్ విభాగం చర్చించినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులు హైకమిషన్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించడంపై భారత్ వివరణ కోరింది. ప్రతి ఒక్కరిని గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది.