శత్రుదేశాలకు ముచ్చెమటలే.. . ఇండియన్ బోర్డర్లో.. దుమ్మురేపి.. దమ్ము చూపేందుకు సిద్ధమైన రాఫెల్

శత్రుదేశాలకు ముచ్చెమటలే.. . ఇండియన్ బోర్డర్లో.. దుమ్మురేపి.. దమ్ము చూపేందుకు సిద్ధమైన రాఫెల్

నిన్నటి దాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాఫెల్ రానే వచ్చేసింది. మరి.. రాఫెల్ రాకతో.. IAF స్టామినా డబులైనట్లేనా? రాఫెల్‌ రాకముందు.. మన ఎయిర్‌ఫోర్స్ బలమెంత? శత్రుదేశాలైన పాక్, చైనా.. ఇప్పుడు భారత్ వైపు చూడాలంటే వణకాల్సిందేనా? ఆఫ్టర్ రాఫెల్.. ఆకాశంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దమ్ము.. ఎలా కనిపించబోతోంది?

ఏ ఫైటర్ జెట్ పేరు వింటే.. శత్రుదేశాలకు చెమటలు పడతాయో.. ఏ ఫైటర్ జెట్ ఎయిర్‌లోకి వస్తే.. ప్రత్యర్థుల గుండెలు అదురుతాయో.. ఏ యుద్ధవిమానం కనిపిస్తే.. శత్రుదేశం వెన్నులో వణుకు పుడుతుందో.. అలాంటి ఫైటర్ జెట్ ఇప్పుడు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరింది. ఇక.. బోర్డర్లో రఫ్ఫాడించడమే మిగిలింది.

రాఫెల్ రాకతో.. ఆకాశంలో మన ఎయిర్‌ఫోర్స్ డామినేషన్ మరో లెవెల్‌కి వెళ్లనుంది. అంబాలా ఎయిర్ బేస్‌లో.. రాఫెల్‌ యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది.

భారత సైన్యం అమ్ములపొదిలో రాఫెల్ చేరడాన్ని.. 23 ఏళ్లలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చోటు చేసుకుంటున్న అతికీలక పరిణామంగా రక్షణశాఖ భావిస్తోంది. తొలి విడతలో 5 రాఫెల్ యుద్ధవిమానాలు అంబాలాలో ల్యాండ్ అయ్యాయి. ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్‌గా.. ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో.. రాఫెల్ టాప్‌లో ఉంటుంది. అలాంటి.. ఫైటర్ జెట్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉందంటే.. శత్రుదేశం గుండెల్లో వణుకుపుట్టడం ఖాయమని చెబుతున్నాయ్ రక్షణశాఖ వర్గాలు.

రాఫెల్ మల్టీరోల్ ఫైటర్ జెట్. దీని ద్వారా.. అనేక మిషన్లు చేపట్టవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాడొచ్చు. ఏవియానిక్స్‌, రాడార్‌ సిస్టమ్ దీని ఎక్స్‌ట్రా ఫీచర్స్. ఆయుధ వ్యవస్థపరంగా రాఫెల్‌ దక్షిణాసియాలోనే ది బెస్ట్ ఫైటర్ జెట్ అని చెబుతున్నారు రక్షణరంగ నిపుణులు.

ఇప్పటికే ఇండియా దగ్గర రష్యన్ మేడ్ సుఖోయ్-30MKI, మిగ్-29 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఫ్రెంచ్ మేడ్ మిరాజ్-2000, భారత్‌లో తయారైన తేజస్ యుద్ధవిమానాలు కూడా ఉన్నాయి. వీటన్నింటితో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బలంగా ఉంది. ఇప్పుడు ఆ బలానికి.. రాఫెల్ కూడా తోడైంది. దీంతో.. IAF బలం వెయ్యి ఓల్ట్‌లు పెరిగినట్లేనని చెబుతున్నారు.

పాకిస్థాన్‌ వద్ద ఉన్న ఎఫ్‌-16, చైనా తయారు చేసిన ఐదో తరం జేఎఫ్‌-20 కంటే కూడా.. రఫేల్‌ తోపు అని చెబుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌, మాలి, లిబియా, ఇరాక్‌, సిరియాలో జరిగిన యుద్ధాల్లో.. రఫేల్ తన సత్తా చాటింది. ఇప్పుడు.. ఇండియన్ బోర్డర్లో.. దుమ్మురేపి.. దమ్ము చూపేందుకు సిద్ధంగా ఉంది.