Sri Krishna Janmashtami : కిట్టయ్య ఆకలికి ఆగలేడు..! రోజుకు 10 సార్లు నైవేద్యం పెట్టే 1500ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీకృష్ణుడి ఆలయం విశేషాలు

ఈ దేవాలయంలో కన్నయ్యకి ఆకలి చాలా చాలా ఎక్కువ. అందుకే కన్నయ్యకి రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. అలా పెట్టకపోతే క్రిష్ణుడు బలహీనమైపోతాడట..1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఎన్నో వింతలు..విశిష్టితలు కలిగి ఉంది.

Sri Krishna Janmashtami : కిట్టయ్య ఆకలికి ఆగలేడు..! రోజుకు 10 సార్లు నైవేద్యం పెట్టే 1500ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీకృష్ణుడి ఆలయం విశేషాలు

‘Hunger Krishna’kerala kottayam thiruvarppu

Sri Krishna Janmashtami 2022 : కిట్టయ్యకు వెన్న అంటే ఎంతో ఇష్టం. అమ్మ యశోదమ్మ గిన్నెల కొద్దీ వెన్న పెట్టినా క్రిష్టయ్యకి పక్కింటిలో దొంగతనంగా తినే వెన్న అంటేనే ఇష్టం. అందుకే కిట్టయ్యని నవనీత చోరుడు అంటారు. భారతదేశ వ్యాప్తంగా శ్రీక్రిష్టుడికి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ది కలిగిన దేవాలయంలో చాలా చాలా విశిష్టత కలిగిన దేవాలయం గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ దేవాలయంలో కన్నయ్యకి ఆకలి చాలా చాలా ఎక్కువట..అందుకే కన్నయ్యకి రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. దేవభూమిగా పేరొందిన కేరళలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు కొలువైన ఈ ఆలయంలో.. దేవుడి విగ్రహం ఆకలితో బాధపడుతూ ఉంటుందట..!అందుకే. స్వామివారికి రోజుకు 10సార్లు నైవేద్యం పెడతారు. అలా పెట్టకపోతే ఆ విగ్రహం బలహీనంగా మారుతుందట..!!

ఈరోజు (ఆగస్టు 18,2022)శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ వింత..ఆలయం గురించి తెలుసుకుందాం..ఈ శ్రీ కృష్ణుని ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువేరపు లేదా తిరువరప్పు ప్రాంతంలో ఉంది. ఆ ఆలయంలో ప్రతిష్టించిన కృష్ణుడి విగ్రహం ఆకలిని అస్సలు తట్టుకోలేదట. ఈ దేవాలయానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి 10 సార్లు నైవేద్యాన్ని పెడతారు. అలా కిట్టయ్యకు నైవేద్యంగా పెట్టిన ప్లేట్‌లో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గుముఖం పడుతుందట..ఈ విషయాన్ని భక్తులు చెబుతుంటారు.

కృష్ణుడు తన మేనమామ కంసుడిని సంహరించాక బాల క్రిష్ణుడు చాలా ఆకలితో ఉన్నాడని.. అదే విధంగా ఈ ఆలయంలోని భగవంతుని విగ్రహం ఆకలితో బాధపడుతుందని హిందువుల విశ్వాసం. స్వామివారికి నైవేద్యం పెట్టడంలో కొంచెం ఆలస్యం అయినా.. విగ్రహం స్వయంచాలకంగా సన్నబడుతుందట..!

ఈ ఆలయాన్ని రోజుకు రెండు నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు రెండు నిమిషాలు మాత్రమే నిద్రపోతాడట.. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే..ఆలయ తాళపుచెవులను పూజారి వద్దే ఉంటాయి. తాళపుచెవులతో పాటు ఓ గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. తలుపులు తాళం కీతో తెరవలేకపోతే.. తలుపులు తెరవడానికి గొడ్డలిని ఉపయోగంచి పగలగొట్టవచ్చు.. ఈ విషయంలో పూజారికి పూర్తి అనుమతి ఉంది. వందల ఏళ్లుగా ఈ పద్దిని పాటిస్తున్నారు ఆలయ నిర్వాహకులు.

గ్రహణ సమయంలో తెరచిఉండే ఆలయం మరో ప్రత్యేకత..
సాధారణంగా ప్రసిద్ధి చెందిన చాలా ఆలయాలు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం సమయాల్లో మూసి వేస్తారు. కానీ ఈ క్రిష్టుడి ఆలయాన్ని మాత్రం గ్రహణం వచ్చినా మూయరు. ఆలయ తలుపులు తెరిచి ఉంచుతారు. గ్రహణ సమయంలో కూడా శ్రీకృష్ణుడి విగ్రహాని నైవేద్యం పెడతారు. ఈ ఆలయంలోని స్వామివారి ప్రసాదం తిన్న ఎవ్వరైనా సరే వారి జీవితంలో ఆకలితో బాధపడడని నమ్మకం…చూశారా..ఈ కిట్టయ్య దేవాలయానికి ఎన్ని ప్రత్యేకతలో..