గర్వంగా ఉంది : ఆహారం వండిన నెలసరిలో ఉన్న 28మంది మహిళలు

నెలసరి సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే మహిళలు వచ్చే జన్మలో ఆడ కుక్కలుగా పుడతారు. ఆ వంట తిన్న పురుషులు మరుజన్మలో ఎద్దులవుతారు. ఇది మన శాస్త్రాలు

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 08:52 PM IST
గర్వంగా ఉంది : ఆహారం వండిన నెలసరిలో ఉన్న 28మంది మహిళలు

నెలసరి సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే మహిళలు వచ్చే జన్మలో ఆడ కుక్కలుగా పుడతారు. ఆ వంట తిన్న పురుషులు మరుజన్మలో ఎద్దులవుతారు. ఇది మన శాస్త్రాలు

నెలసరి సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే మహిళలు వచ్చే జన్మలో ఆడ కుక్కలుగా పుడతారు. ఆ వంట తిన్న పురుషులు మరుజన్మలో ఎద్దులవుతారు. ఇది మన శాస్త్రాలు చెబుతున్న విషయం’’ అని ఇటీవల గుజరాత్ లోని భుజ్ లో స్వామి నారాయణ ఆలయానికి చెందిన కృష్ణస్వరూప్‌ దాస్‌జీ అన్న మాటలు వైరల్ అయ్యాయి. తీవ్ర వివాదానికి, విమర్శలకు దారితీశాయి. 

ఇది మరువక ముందే.. భుజ్ ప్రాంతంలోని ఓ మహిళా కాలేజీలో అమానుష ఘటన జరిగిన సంగతి తెలిసిందే. విద్యార్థినుల్లో ఎవరెవరు నెలసరితో ఉన్నారో తెలుసుకునేందుకు లోదుస్తులు తొలగించాల్సిందిగా కాలేజీ ప్రిన్సిపాల్ ఆదేశించడం వివాదాస్పదమైంది. పీరియడ్స్ సమయంలో కొందరు విద్యార్థినులు కిచెన్ లోకి వెళ్తున్నారని, ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నారని వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రిన్సిపాల్ ఈ పని చేసింది. దీంతో నెలసరి గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

రుతుస్రావం సమయంలో మహిళలు ఆహారం వండొచ్చా? లేదా? అమ్మాయిలు కిచెన్ లోకి వెళ్లొచ్చా? లేదా? ఆలయంలోకి వెళ్లొచ్చా? లేదా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన 28మంది మహిళలు.. అనుమానాలు తొలగించేందుకు.. నెలసరి సమయంలో ఆహారం వండారు. రుతుస్రావం మహిళగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం అని నినాదం వినిపించారు. 

సచ్చి సహేలి ఫౌండర్ సుర్బి సింగ్ ఆధ్వర్యంలో ఈ పీరియడ్ ఫీస్ట్ నిర్వహించారు. నెలసరి సమయంలో ఉన్న 28మంది మహిళలు ఈ వంట వండారు. సుమారు 500మందికి సరిపడ ఆహారం వండారు. దాన్ని అందరూ తిన్నారని, అయినా ఎవరికీ ఏమీ కాలేదన్నారు. నెలసరిలో ఉన్న మహిళలు వండిన ఆహారం తింటే ఏమీ కాదని చెప్పడమే తమ ఉద్దేశ్యం అని సుర్బి సింగ్ అన్నారు. ఇదే నిజమని చెప్పారు. రుతుస్రావంలో ఉన్న మహిళలను అంటరాని వారిగా చూడటం కరెక్ట్ కాదన్నారు. ఆచారాలు, నియమాల పేరుతో మూఢ నమ్మకాలు రుద్దడం సరికాదన్నారు. నెలసరిలో ఉన్న మహిళలు, అమ్మాయిలు.. స్వేచ్చగా ఉండొచ్చని, ఎక్కడైనా తిరగొచ్చు, దేన్నైనా తాకొచ్చని ఆమె స్పష్టం చేశారు.