Maharashtra CM : కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదం..10 మంది మృతి, మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పిన సీఎం

ముంబైలో అగ్నిప్రమాదానికి గురైన కోవిడ్‌ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే సందర్శించారు.

Maharashtra CM : కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదం..10 మంది మృతి, మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పిన సీఎం

Maharastra

I apologise : ముంబైలో అగ్నిప్రమాదానికి గురైన కోవిడ్‌ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే సందర్శించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉద్ధవ్‌ మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. అయితే మాల్‌లో ఆసుపత్రిని ఏర్పాటు చేయడంపై వెల్లువెత్తిన విమర్శలకు సీఎం సమాధానం ఇచ్చారు. కరోనా సమయంలో కోవిడ్‌ పేషంట్స్‌ కోసమే ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆసుపత్రికి మార్చి 31 వరకు అనుమతి ఉందని ఇంతలోనే ఈ భయానక అగ్ని ప్రమాదం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్ధవ్.

పైర్‌ ఆసుపత్రిలో సంభవించలేదని…పక్క నున్న షాపులో చెలరేగిన మంటలు ఆసుపత్రికి వ్యాపించాయన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అగ్నిప్రమాదంలో మరణించినవారంతా వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నట్లు ఉద్ధవ్‌ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులెవరైనా వారిని వదిలేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. ముంబైలోని కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 10 కి చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భాండప్ ప్రాంతంలోని ఓ మాల్‌లో ఈ ఆసుపత్రి నడుస్తోంది.

అర్ధరాత్రి దాటాకా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి భవనంలోని మూడు, నాలుగు అంతస్థుల్లో మంటలు చెలరేగాయి. 23 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. 14 గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రాలేదు. మొత్తం 76 మంది రోగులు ఆసుపత్రిలో ఉండగా వారిలో 73 మంది కోవిడ్ -19 రోగులు. వీరందరినీ వివిధ ఆసుపత్రులకు తరలించారు. భాండప్ ప్రాంతంలోని ఈ డ్రిమ్‌ మాల్‌ను 2009లో నిర్మించారు.

ఇందులో 1,000 చిన్న దుకాణాలు, 2 బాంకెట్‌ హాళ్లు, ఒక ఆసుపత్రి ఉంది. కరోనా సమయంలో ప్రత్యేకంగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ముంబై మేయర్ కిషోర్ పెడ్నేకర్ ఘటనాస్థలిని పరిశీలించారు. అగ్రిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని మేయర్ తెలిపారు. ఒక మాల్‌లో ఆస్పత్రిని ఏర్పాటు చేశారని, ఇలాంటి ఆస్పత్రిని తాను చూడడం ఇదే మొదటిసారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.