India Slams China : వెంకయ్య అరుణాచల్ పర్యటనపై చైనా అభ్యంతరం..ధీటుగా బదులిచ్చిన భారత్
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని భారత్ తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం మరియు విడదీయరాని

Venkaiah
India Slams China ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని భారత్ తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం మరియు విడదీయరాని భాగం అని భారత విదేశాంగశాఖ సృష్టం చేసింది.
అసలేం జరిగింది
అక్టోబర్-9న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. అరుణాచల్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో వెంకయ్య ప్రసంగించారు. కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన ఈశాన్య భారతంలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోందని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత నేతల పర్యటనలను వ్యతిరేకించడం అలవాటుగా మార్చుకున్న చైనా..తాజాగా వెంకయ్య పర్యటనపై విమర్శలు గుప్పించింది.
వెంకయ్య అరుణాచల్ పర్యటనపై స్పందించాల్సిందిగా చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియాన్ ను అక్కడి అధికార మీడియా బుధవారం ప్రశ్నించింది. జావో లిజియాన్ బుధవారం బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ..చైనా ప్రభుత్వం ఎప్పుడూ అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో రాష్ట్రంగా గుర్తించలేదు.సరిహద్దు అంశంలో చైనా స్థిరమైన, స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. భారత్ అక్రమంగా, ఏకపక్షంగా అరుణాచల్ ప్రదేశ్‌ను రాష్ట్రంగా గుర్తించింది. ఆ ప్రాంతంలో భారత నేతల పర్యటనను చైనా వ్యతిరేకిస్తుందని చెప్పారు.
చైనా కామెంట్స్ పై భారత్ ఘాటుగా స్పందించింది. భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..చైనా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం మరియు విడదీయరాని భాగం అని సృష్టం చేశారు. మిగతా ప్రాంతాల్లో పర్యటించినట్లే ఆ రాష్ట్రంలోనూ నేతలు పర్యటిస్తారన్నారు.
ALSO READ Commander Talk : భారత్- చైనా, అసంపూర్తిగా 13వ విడత చర్చలు