Indian ARMY Jet Pack Suits : భారత జవాన్లకు మోడ్రన్ ‘జెట్‌ప్యాక్ సూట్స్’ .. హైటెక్‌గా మారబోతున్న ఇండియన్ ఆర్మీ..

రాబోయే రోజుల్లో.. స్పెషల్ ఆపరేషన్ల కోసం మన భారత జవాన్లు గాల్లో ఎగరబోతున్నారు. వినటానికి ఇది విఠలాచార్య సినిమాలా అనిపించినా ఇది నిజమే. కొత్తగా వచ్చే ప్రతి టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇక గాల్లో కూడా ఎగురుతూ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించనున్నారు ఇండియన్ ఆర్మీ జవాన్లు.

Indian ARMY Jet Pack Suits : భారత జవాన్లకు మోడ్రన్ ‘జెట్‌ప్యాక్ సూట్స్’ .. హైటెక్‌గా మారబోతున్న ఇండియన్ ఆర్మీ..

Indian ARMY Jet Pack Suits

Indian ARMY Jet Pack Suits : దేశ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ పటిష్టంగా ఉంది. మన దగ్గర అత్యాధునిక ఆయుధాలున్నాయ్. అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉంది. శత్రువులు ఎటువైపు నుంచి దాడి చేసినా.. తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఉంది. వెపన్స్ లేకపోయినా.. శత్రుమూకలను వేటాడేంత ధైర్యం మన సైన్యానికి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లు.. ఎంత అప్‌గ్రేడెడ్‌గా ఉండాలో ఇండియన్ ఆర్మీ అలాగే ఉంది. అలాగని.. రిలాక్స్ అవలేం. అందువల్ల.. కొత్తగా వచ్చే ప్రతి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చూస్తోంది ఇండియన్ ఆర్మీ. రాబోయే రోజుల్లో.. స్పెషల్ ఆపరేషన్ల కోసం మన జవాన్లు గాల్లో ఎగరబోతున్నారు.

వినటానికి ఇదేదో విఠలాచార్య సినిమాలా అనిపిస్తున్నా త్వరలోనే మన ఇండియన్  ఆర్మీ జవాన్లు గాల్లో ఎగరనున్నారు. స్పెషల్ ఆపరేషన్ల కోసం.. గాల్లో ఎగురుతూ వెళ్లి.. శత్రువుల సరదా తీర్చేయనున్నారు. కొద్ది రోజుల్లోనే.. ఇండియన్ ఆర్మీ హైటెక్‌గా మారబోతోంది. జవాన్లు ఎగిరేందుకు వీలుగా.. ఇలాంటి జెట్ ప్యాక్ సూట్స్‌ని కొనుగోలు చేయాలని డిసైడ్ అయింది. ఇవి గనక అందుబాటులోకి వస్తే.. మన ఆర్మీ మరింత పటిష్టమవుతుంది. రెస్క్యూ ఆపరేషన్లు అయినా.. ఆర్మీ స్పెషల్ మిషన్లయినా.. ఈ జెట్ సూట్స్‌ని ధరించి.. ఎగురుకుంటూ వెళ్లి.. ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేసేసి వస్తారు మన జవాన్లు.

కొన్నేళ్ల క్రితమే.. ఈ జెట్ సూట్స్.. మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేశాయ్. వీటిని తయారు చేసిన కంపెనీలు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే వీటిని అప్పుడప్పుడు వినియోగిస్తున్నారు. అయితే.. ఈ సూట్స్‌ని టెస్ట్ చేయడం, మార్పులు-చేర్పులు చేయడం, ఎక్కువ బరువును గాల్లోకి తీసుకెళ్లేలా మార్చడం, లేటెస్ట్ టెక్నాలజీని జోడించడం లాంటి వాటన్నింటికి కాస్త టైమ్ పట్టింది. ఇప్పుడు వీటి డిజైన్ పూర్తిగా సెట్ అయినట్లే కనిపిస్తోంది. మనిషి చాలా సులువుగా, వేగంగా.. గాల్లో ఎగిరేందుకు, ముందుకు సాగేందుకు.. పర్ఫెక్ట్‌గా పనిచేస్తోంది. అమెరికా, దుబాయ్‌‌లో ఇవి బాగా పాపులర్. ఫ్రాన్స్‌లోనూ ఈ జెట్ సూట్‌ని ప్రదర్శించారు. అమెరికా కూడా వీటిని తమ జవాన్లకు అందజేయాలనే ఆలోచనతో ఉంది. మిగతా దేశాల ఆర్మీలు కూడా వీటిని కొనుగోలు చేసి.. సోల్జర్స్‌కి వాటిని ఎలా వాడాలన్న దానిపై శిక్షణ ఇప్పించేందుకు సమాలోచనలు జరుపుతున్నాయ్. ఇప్పుడు భారత్ కూడా ఆ దిశగానే ముందడుగు వేస్తోంది.

అమెరికా.. ఇప్పటికే ఈ జెట్ ప్యాక్ సూట్స్‌పై ట్రయల్స్ మొదలుపెట్టింది. తమ సోల్జర్స్‌తో కలిపి.. కొన్ని డెమో ఆపరేషన్లు కూడా చేస్తోంది. కొండ ప్రాంతాల్లో.. మూరుమూల ప్రదేశాల్లో ఎవరికైనా అనారోగ్యం తలెత్తితే.. వెంటనే వాళ్లకు మెడికల్ సపోర్ట్ ఇచ్చేందుకు అవసరమైన మందులు తెచ్చివ్వడం లాంటివి ట్రై చేశారు. అలాగే.. అడవుల్లో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు.. కూడా ఈ జెట్ సూట్లను వాడుతున్నారు. చెట్ల పొదల మాటున, అడవుల్లో తలదాచుకొని దాడులు చేసే టెర్రరిస్టులను.. గాల్లో నుంచే ఫినిష్ చేసేలా.. ఈ జెట్ సూట్స్ ఉపయోగపడనున్నాయి. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో.. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి కశ్మీర్‌లోకి వచ్చే డ్రోన్లు కూడా బాగా పెరిగిపోయాయ్. అలాంటి వాటిని.. గాల్లోనే పేల్చేందుకు కూడా ఈ జెట్‌ప్యాక్స్ సూట్స్ అవసరమవుతాయి. అన్ని సార్లు భూమి మీద నుంచి వచ్చే ప్రమాదాలను పసిగట్టలేం. కొన్నిసార్లు.. జవాన్ల కళ్లు గప్పి.. సరిహద్దులు దాటేస్తుంటారు శత్రువులు. అందువల్ల.. బోర్డర్ దగ్గర్లో ఏమాత్రం అలజడి కనిపించినా.. వెంటనే ఈ జెట్ సూట్‌తో గాల్లోకి లేచి.. పై నుంచి నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరగకముందే.. క్విక్ యాక్షన్ తీసుకునే వీలు కలుగుతుంది.

కశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో అప్పుడప్పుడు ఉగ్రవాదులు కొన్ని ఇళ్లలో చొరబడి.. అక్కడే తలదాచుకుంటూ ఉంటారు. వాళ్లు.. ఎన్ని గంటలైనా అందులో నుంచి బయటకు రాకుండా కాల్పులు జరుపుతుంటారు. ఈ క్రమంలో.. కొందరు జవాన్లు అమరులయ్యారు. అదే.. ఈ జెట్ సూట్ ఉంటే.. గాల్లో నుంచి వెళ్లి.. వాళ్ల ఆచూకీ కనిపెట్టి.. వెంటనే వాళ్లను మట్టుబెట్టేందుకు వీలవుతుంది. టెర్రరిస్టులు భూమి మీద ఎక్కడ నక్కినా.. గాల్లోకి ఎగిరితే.. వాళ్ల జాడ ఇట్టే కనిపెట్టి.. తుపాకీ ఎక్కుపెట్టొచ్చు. అమెరికా వీటి మీద టెస్ట్ ట్రయల్స్ చేయడానికి కూడా కారణం అదే. కేవలం.. మిలటరీ ఆపరేషన్లకు మాత్రమే కాదు. రెస్క్యూ ఆపరేషన్లకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి.

ఇండియన్ ఆర్మీ దగ్గర ఇప్పటికే అత్యాధునిక ఆయుధాలున్నాయ్. మన సైనికుల చేతుల్లోని తుపాకులను కూడా మార్చబోతోంది ప్రభుత్వం. ఇప్పుడున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో.. ఏకే-203 రైఫిళ్లను చేర్చబోతోంది. అలాగే.. జవాన్లకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను కూడా అందించబోతోంది. ఇటీవలే.. కొత్త కాంబాట్ యూనిఫామ్‌కి కూడా అప్రూవల్ వచ్చేసింది. ఇక.. మిగిలిందల్లా.. మన మిలటరీని మోడ్రనైజ్ చేయడమే. ఆ దిశగానే.. ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మన సైనికులను.. హైటెక్‌గా మార్చాలని నిర్ణయించింది. జవాన్లు గాల్లో ఎగిరేందుకు.. ప్రత్యేక పరిస్థితుల్లో ఘటనా స్థలానికి వీలైనంత వేగంగా చేరుకునేందుకు.. 48 జెట్ ప్యాక్ సూట్స్ కోసం టెండర్లు పిలిచింది ఇండియన్ ఆర్మీ. ఆ సూట్స్.. కనీసం గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఉండాలని చెప్పింది. ఇందుకోసం.. టెండర్లు కూడా పిలిచారు. మోడ్రన్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో కూడిన సూట్స్.. అన్ని దిశల్లో సేఫ్ టేకాఫ్, ల్యాండింగ్ కోసం అవసరమైన కంట్రోల్స్ అందించాలని.. ఇండియన్ ఆర్మీ సూచించింది. ఇప్పటికే.. జెట్‌ప్యాక్ సూట్స్ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా పెట్టారు.

జెట్‌ప్యాక్ సూట్స్‌తో పాటు వంద రోబోటిక్ మ్యూల్స్, అలాగే.. 130 న్యూ జనరేషన్ టెథర్డ్ డ్రోన్ సిస్టమ్‌లకు కూడా భారత ఆర్మీ టెండర్లు పిలిచింది. వీలైనంత త్వరగా వాటిని అందించాలని చెప్పింది. ఇక.. పర్వత ప్రాంతాలు, 10 వేల అడుగుల ఎత్తులో ఉండే ప్రదేశాల్లో అవసరాల కోసం.. నాలుగు కాళ్లతో కూడిన రోబోటిక్ మ్యూల్స్‌ని కూడా కొనుగోలు చేయబోతోంది ఇండియన్ ఆర్మీ. గ్రౌండ్ బేస్డ్ స్టేషన్‌కి.. లింక్ చేసేందుకు.. టెథర్డ్ సిస్టమ్ డ్రోన్‌లను వాడనున్నారు. పైగా.. ఎక్కువ గంటలు నిఘా ఉంచేందుకు.. ఈ డ్రోన్లు పనిచేయనున్నాయ్. ఈ మోడ్రన్ జెట్ ప్యాక్ సూట్స్ గనక మన జవాన్లకు అందుబాటులోకి వస్తే.. ఇండియన్ ఆర్మీకి మరింత బూస్ట్ వస్తుంది. శత్రువుల కదలికలను పసిగట్టి.. వారిని వీలైనంత త్వరగా న్యూట్రలైజ్ చేయడానికి.. ఇవి ఉపయోగపడతాయ్. శత్రువుకి ఏం జరిగిందో అర్థమయ్యేలోపే.. ఈ జెట్ ప్యాక్ సూట్స్‌తో టార్గెట్లను ఫినిష్ చేసేందుకు వీలవుతుంది.