దుబాబ్ లో భార్యను కాపాడబోయిన భర్త … 90శాతం కాలిపోయాడు

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 10:55 AM IST
దుబాబ్ లో భార్యను కాపాడబోయిన భర్త … 90శాతం కాలిపోయాడు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఓ భారతీయ వ్యక్తి కుటుంభంలో దారుణం చోటుచేసుకుంది. భార్య ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ఓ భర్త ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అసలేం జరిగిందంటే.. భారత్‌కు చెందిన అనిల్ (32) అతని భార్య నీనుతో కలిసి దుబాయ్ లోని ఉమ్ అల్ క్వైన్‌ లో నివసిస్తున్నాడు.

అయితే అనిల్ ఉంటున్న అపార్ట్ మెంట్ లో సోమవారం (ఫిబ్రవరి 10, 2020) రాత్రి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బెడ్‌రూంలో ఉన్న అనిల్ తన భార్య మంటల్లో చిక్కుకోవడాన్ని చూసి ఆమెను రక్షించాడు. ఈ సమయంలో అతనికి శరీరానికి తెలియకుండానే మంటలు అంటుకున్నాయి. దీంతో దాదాపు 90 శాతం శరీరం కాలిపోయింది.

అనంతరం అనిల్‌ ను అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అనిల్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. అంతేకాదు అనిల్ భార్య నీను.. కాలిన గాయాల నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు.